Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

అక్షర పాఠశాలలో కన్నుల పండువగా బోనాల సంబరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అక్షర పాఠశాలలో కన్నుల పండువగా బోనాల సంబరాలు

ముధోల్,ఆగస్టు 08(పున్నమి ప్రతినిధి ): మండల కేంద్రమైన ముధోల్ లోని అక్షర పాఠశాలలో శనివారం బోనాల సంబరాలు కన్నుల పండువగా సాగాయి, పాఠశాల డైరెక్టర్ సుభాష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ వేడుకలను ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని పేర్కొంటూ, విద్యార్థులకు పండుగ విశిష్టతను వివరించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ధరించిన పోతురాజుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థినులు బోనాలతో, పాటలు పాడుతూ, ఆడుతూ అత్యంత ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సాయికుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అక్షర పాఠశాలలో కన్నుల పండువగా బోనాల సంబరాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *