Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

అక్రమ ఇసుక రవాణాపై మైన్స్ శాఖ ఉక్కుపాదం బిల్లులు లేకుండా తరలిస్తున్న టిప్పర్ లారీలకు భారీ జరిమానాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అక్రమ ఇసుక రవాణాపై మైన్స్ శాఖ ఉక్కుపాదం బిల్లులు లేకుండా తరలిస్తున్న టిప్పర్ లారీలకు భారీ జరిమానాలు

వార్త ముఖ్యాంశాలు

  • తాళ్లపూడి, జూన్ 9 (పున్నమి ప్రతినిధి): ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని ఎగ్గొట్టి, బిల్లులు లేకుండా అక్రమంగా మట్టి, ఇసుక తరలిస్తున్న టిప్పర్ లారీల ఆటను ఏడీ మైన్స్ ఫణిభూషణ్ రెడ్డి కట్టడి చేశారు.
  • పక్కా సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న లారీలను గుర్తించి భారీ జరిమానాలు విధించారు.
  • తాళ్లపూడి ప్రధాన రహదారిపై పలు లారీలు బిల్లులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాయనే సమాచారంతో ఏడీ మైన్స్ ఫణిభూషణ్ రెడ్డి తన సిబ్బందితో కలిసి దాడులు చేపట్టారు.

తాళ్లపూడి, జూన్ 9 (పున్నమి ప్రతినిధి):
ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని ఎగ్గొట్టి, బిల్లులు లేకుండా అక్రమంగా మట్టి, ఇసుక తరలిస్తున్న టిప్పర్ లారీల ఆటను ఏడీ మైన్స్ ఫణిభూషణ్ రెడ్డి కట్టడి చేశారు. పక్కా సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న లారీలను గుర్తించి భారీ జరిమానాలు విధించారు.
తాళ్లపూడి ప్రధాన రహదారిపై పలు లారీలు బిల్లులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాయనే సమాచారంతో ఏడీ మైన్స్ ఫణిభూషణ్ రెడ్డి తన సిబ్బందితో కలిసి దాడులు చేపట్టారు. తాళ్లపూడి మండలం గజ్జరం, చింతల ప్రాంతాల్లో లారీలను తనిఖీ చేయగా, ఒకే బిల్లుపై పలుమార్లు ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ సందర్భంగా ఏడీ మైన్స్ ఫణిభూషణ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ సహజ వనరులను దోచుకుంటున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. బిల్లు లేకుండా ఒక్క టిప్పర్ కదిలినా సీజ్ చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన లారీలపై జరిమానాలు విధించినట్లు వెల్లడించారు.
అధికారుల ఆకస్మిక తనిఖీలతో అక్రమ రవాణాదారుల్లో కలవరం నెలకొంది. బిల్లులు లేకుండా ఇసుక తరలిస్తే లారీలు మాత్రమే కాకుండా లైసెన్సులు కూడా రద్దు చేసే చర్యలు తీసుకుంటామని మైన్స్ శాఖ స్పష్టం చేసింది. దీంతో లారీ యజమానులు అప్రమత్తమవుతున్నారు.
రోజూ రాత్రింబవళ్లు ఓవర్‌లోడ్‌తో, బిల్లులు లేకుండా ఇసుక రవాణా చేయడం వల్ల రహదారులు దెబ్బతింటున్నాయని, దుమ్ము, ధూళి కారణంగా ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కఠిన చర్యలు చేపట్టడం సంతోషకరమని వారు అభిప్రాయపడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *