వార్త ముఖ్యాంశాలు
- తిరుపతి జిల్లా బుచ్చినాయిడు కండ్రిగ మండలంలోని స్థానిక విద్యాస్ వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కరెస్పాండంట్ విద్యా ప్రకాష్ రెడ్డి గారి అధ్యక్షతన ప్రిన్సిపాల్ సాయి కుమార్ గారి ఆధ్వర్యంలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలును ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ,శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో మన…
- ఆ విలువలను మన విద్యార్థులు తమ జీవితాల్లో ఆచరించాలని కోరుకుంటున్నాము.
- విద్యార్థులు చదువుతో పాటు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యమనితెలిపారు.
తిరుపతి జిల్లా బుచ్చినాయిడు కండ్రిగ మండలంలోని స్థానిక విద్యాస్ వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కరెస్పాండంట్ విద్యా ప్రకాష్ రెడ్డి గారి అధ్యక్షతన ప్రిన్సిపాల్ సాయి కుమార్ గారి ఆధ్వర్యంలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలును ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ,శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వేడుకలను నిర్వహించామని,
ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ఎంతో అందంగా ముస్తాబై, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.చిన్నారుల కృష్ణ, గోపికల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయని,శ్రీకృష్ణుడు మనకు ధర్మం, సత్యం, కర్తవ్యనిష్ఠ, మంచి మార్గంలో నడవడం వంటి గొప్ప విలువలను బోధించారు. ఆ విలువలను మన విద్యార్థులు తమ జీవితాల్లో ఆచరించాలని కోరుకుంటున్నాము.
విద్యార్థులు చదువుతో పాటు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యమనితెలిపారు. అనంతరం విద్యార్థులు అందరికీ ప్రసాదలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.