Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వాడపాలెంలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వాడపాలెంలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

వార్త ముఖ్యాంశాలు

  • *ప్రజా దర్బార్ ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి...* వాడపాలెంలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వారం, వారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు తెలిపారు.
  • ఇదే రీతిలో గ్రామ స్థాయిలోని ప్రతి నాయకుడు వారంలో ఒక రోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేటాయించాలని ఆయన సూచించారు.
  • శుక్రవారం వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు ప్రజా దర్బార్ నిర్వహించారు.

*ప్రజా దర్బార్ ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి…*

వాడపాలెంలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

వారం, వారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు తెలిపారు. ఇదే రీతిలో గ్రామ స్థాయిలోని ప్రతి నాయకుడు వారంలో ఒక రోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేటాయించాలని ఆయన సూచించారు. శుక్రవారం వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా సామాన్య ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా, సులభంగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నామన్నారు. స్థానిక నాయకులు సైతం అధికారులతో సమన్వయం చేసుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని కోరారు. ప్రజాదర్బార్ లో భాగంగా ప్రజల నుంచి ఎమ్మెల్యేకు 16 వినతులు అందాయి. పలు సమస్యలను ఎమ్మెల్యే అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *