Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

పాడేరు: దళితుల మరణాలపై ప్రభుత్వం స్పందించాలి : బియస్పీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పాడేరు: దళితుల మరణాలపై ప్రభుత్వం స్పందించాలి : బియస్పీ

వార్త ముఖ్యాంశాలు

  • పాడేరు: కూటమి ప్రభుత్వం గత రెండేళ్ల పాలనలో 27 మంది దళితుల మరణాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని అల్లూరి జిల్లా బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు.
  • మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.
  • 1989 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి, ఘటనలకు బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

పాడేరు: కూటమి ప్రభుత్వం గత రెండేళ్ల పాలనలో 27 మంది దళితుల మరణాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని అల్లూరి జిల్లా బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. 1989 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి, ఘటనలకు బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ బీఎస్పీ అధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్ ఆదేశాల మేరకు పాడేరు కలెక్టరేట్‌ ఎదుట నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం అల్లూరి జిల్లా బియస్పీ అధ్యక్షుడు శెట్టి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్‌ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అరకు, పాడేరు నియోజకవర్గాల బీఎస్పీ అధ్యక్షులు ప్రియాంకరాజ్, పోతురాజు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *