Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

అనకాపల్లి ఆర్టీసీ ప్రాంగణంలో నీటి నిల్వ సమస్య పరిష్కరించాలి..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అనకాపల్లి ఆర్టీసీ ప్రాంగణంలో నీటి నిల్వ సమస్య పరిష్కరించాలి..

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) అనకాపల్లి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ప్రాంగణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి, ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరుతూ సీపీఎం నాయకులు శుక్రవారం జిల్లా రవాణా కార్యాలయంలో ఏఎంవై సూర్యారావుకు వినతిపత్రం అందజేశారు.
  • సీపీఎం మండల కన్వీనర్ గంటా శ్రీరామ్, జిల్లా కమిటీ సభ్యులు వీవీ శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు కాళ్ల తేలయ్యబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా గంటా శ్రీరామ్ మాట్లాడుతూ భారీ వర్షాలకు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ప్రాంగణం నీటితో నిండిపోవడంతో ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)

అనకాపల్లి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ప్రాంగణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి, ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరుతూ సీపీఎం నాయకులు శుక్రవారం జిల్లా రవాణా కార్యాలయంలో ఏఎంవై సూర్యారావుకు వినతిపత్రం అందజేశారు. సీపీఎం మండల కన్వీనర్ గంటా శ్రీరామ్, జిల్లా కమిటీ సభ్యులు వీవీ శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు కాళ్ల తేలయ్యబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గంటా శ్రీరామ్ మాట్లాడుతూ భారీ వర్షాలకు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ప్రాంగణం నీటితో నిండిపోవడంతో ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుమారు రూ.80 లక్షలు ఖర్చు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆర్టీసీ అధికారులు, జీవీఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రాంగణాన్ని ఎత్తు చేసి, వర్షపు నీరు సులభంగా బయటకు వెళ్లేలా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *