వార్త ముఖ్యాంశాలు
- జలదంకి: అనారోగ్యంతో తుదిశ్వాస..
- పలువురు నాయకుల సంతాపం కావలి డివిజన్లో సీనియర్ కమ్యూనిస్టు నాయకుడిగా గుర్తింపు పొందిన మేలింగ్ ఆంథోని (80) శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు.
- జలదంకి గ్రామంలో గత నాలుగు దశాబ్దాలుగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్)లో క్రియాశీల సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు.వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కమిటీ సభ్యుడిగా, జలదంకి మండల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
జలదంకి: అనారోగ్యంతో తుదిశ్వాస.. పలువురు నాయకుల సంతాపం
కావలి డివిజన్లో సీనియర్ కమ్యూనిస్టు నాయకుడిగా గుర్తింపు పొందిన మేలింగ్ ఆంథోని (80) శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. జలదంకి గ్రామంలో గత నాలుగు దశాబ్దాలుగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్)లో క్రియాశీల సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు.వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కమిటీ సభ్యుడిగా, జలదంకి మండల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రజా, కార్మిక ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషించారు. ఆయన భార్య కరోనా సమయంలో మృతి చెందగా, ప్రస్తుతం కుమార్తె, కుమారుడు ఉన్నారు.ఆంథోని మృతి పట్ల జలదంకి సీపీఎం శాఖ సీనియర్ నాయకుడు రావి మాల్యాద్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాళ్లూరు మాల్యాద్రి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పసుపులేటి పెంచలయ్య, పట్టణ కమిటీ సభ్యుడు ఎస్. వెంకయ్య తదితరులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఆంథోని అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.