వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు నగరం: నెల్లూరు నగరంలోని రామలింగాపురం అండర్ బ్రిడ్జి కింద నిలిచిపోతున్న మురుగునీరు వాహనదారులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది.
- వర్షాలు తగ్గినప్పటికీ బ్రిడ్జి కింద నుంచి మురుగునీరు ప్రవహించడం ఆగడం లేదు.
- దీంతో అటుగా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నెల్లూరు నగరం:
నెల్లూరు నగరంలోని రామలింగాపురం అండర్ బ్రిడ్జి కింద నిలిచిపోతున్న మురుగునీరు వాహనదారులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. వర్షాలు తగ్గినప్పటికీ బ్రిడ్జి కింద నుంచి మురుగునీరు ప్రవహించడం ఆగడం లేదు. దీంతో అటుగా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు వేగంగా వెళ్లే సమయంలో మురుగునీరు పక్కనే వెళ్లే ప్రజలపై చిమ్ముతోంది. దీంతో పాదచారులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో మురుగునీరు నిల్వ ఉండటం వల్ల ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.