Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

ముగిసిన రాష్ట్ర స్థాయి అండర్ 14 సెపక్రా క్రీడలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముగిసిన రాష్ట్ర స్థాయి అండర్ 14 సెపక్రా క్రీడలు

వార్త ముఖ్యాంశాలు

  • ముగిసిన రాష్ట్రస్థాయి అండర్-14 సెపక్త్రా క్రీడలు --------------------------------------------------------- జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ స్టేడియంలో రాష్ట్ర పాఠశాలల 70వ క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన అండర్-14 బాలబాలికల (జూనియర్స్) సెపక్త్రా పోటీలు విజయవంతంగా ముగిశాయి.
  • *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* పర్యవేక్షణలో గురువారం ప్రారంభమైన ఈ పోటీలు, శుక్రవారం హోరాహోరీగా ఫైనల్ మ్యాచ్‌లతో ముగిశాయి.
  • ఉమ్మడి పది జిల్లాల నుంచి బాలికల, బాలుర జట్లు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి.

ముగిసిన రాష్ట్రస్థాయి అండర్-14 సెపక్త్రా క్రీడలు
———————————————————
జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ స్టేడియంలో రాష్ట్ర పాఠశాలల 70వ క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన అండర్-14 బాలబాలికల (జూనియర్స్) సెపక్త్రా పోటీలు విజయవంతంగా ముగిశాయి.
*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* పర్యవేక్షణలో గురువారం ప్రారంభమైన ఈ పోటీలు, శుక్రవారం హోరాహోరీగా ఫైనల్ మ్యాచ్‌లతో ముగిశాయి.
ఉమ్మడి పది జిల్లాల నుంచి బాలికల, బాలుర జట్లు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి.
పోటీల విజేతలు
బాలికల విభాగం:
వరంగల్ – ప్రథమ స్థానం
నిజామాబాద్ జిల్లా – ద్వితీయ స్థానం
మహబూబ్ నగర్ – తృతీయ స్థానం

బాలుర విభాగం:
నల్గొండ జిల్లా – ప్రథమ స్థానం
ఆదిలాబాద్ జిల్లా – ద్వితీయ స్థానం
మహబూబ్ నగర్ జట్టు – మూడో స్థానం
విజేతలకు జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి బహుమతులు అందజేశారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు
ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు:
బాలురు:
కె. రిషిగ్యాన్ (నల్గొండ)
సీహెచ్ హరీశ్ (ఆదిలాబాద్)
ఆర్. గణేష్ (రంగారెడ్డి)
ఇమ్మాన్యుయిల్ (మహబూబ్ నగర్)
ఎస్. ప్రణవ్ (కరీంనగర్)
కె. జేగందర్ (హైదరాబాద్)
కె. రేవంత్‌కుమార్ (నిజామాబాద్)
బాలికలు:
దేవసోత్ స్వప్న (వరంగల్)
సేనావత్ శ్రీవిద్య (రంగారెడ్డి)
అంజని సాత్విక (నిజామాబాద్)
టి. త్రివేణి (మహబూబ్ నగర్)
స్నేహకుమారి (హైదరాబాద్)
మాలౌతు నందిని (వరంగల్)
మంద రుత్విక (కరీంనగర్)
పి. రిషిత (మెదక్)
ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ నరసింహ రావు, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి గోర్ సింగ్, పరిశీలకుడు హరికృష్ణ, సెపక్త్రా రాష్ట్ర కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, నిర్వహణ కమిటీ బాధ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *