పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి
బోగోలు మండలం వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి కర్తం సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ, బోగోలు మండల అభివృద్ధికి మరియు రైల్వే పరంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బోగోలు బజారులోని షాపుల వద్ద వ్యాపారులను కలుసుకుని, అలాగే ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అలాగే బోగోలు బిట్-3 ఎంపీటీసీ అభ్యర్థి చార్లెస్ అనిల్ కుమార్‌ను కూడా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రోడ్లు, డ్రైనేజీలు , స్థానికంగా మరియు ఇతర అభివృద్ధి జరగాలన్న ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బోగోలు మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్