Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

బాసరలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బాసరలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

వార్త ముఖ్యాంశాలు

  • బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
  • తొలి రోజు అమ్మవారు శైలపుత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
  • ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్న ఉత్సవాలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు శైలపుత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్న ఉత్సవాలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో బాసరకు చేరుకుంటున్నారు. ఈ నెల 16న మూల నక్షత్రం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి సదుపాయంతో పాటు పాలు, బిస్కెట్లు, పండ్లు, మజ్జిగ పంపిణీకి చర్యలు తీసుకున్నారు. అక్షరాభ్యాసాల కోసం ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో అంజలీదేవి మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు మెరుగైన వసతులు, భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *