వార్త ముఖ్యాంశాలు
- -- నగరంలో ప్లాస్టిక్ విక్రయాలపై దాడులు -వందల కేజీ ల ప్లాస్టిక్ ఉత్పత్తుల స్వాధీనం ----విక్రేతలకు జరిమానాలు : హెచ్చరికలు నెల్లూరు నగరంలో శుక్రవారం ప్లాస్టిక్ విక్రయాలపై దాడులు జరిగాయి.
- నగర పాలక సంస్థ ఎంహెచ్ఓ ఒబిలి దినేష్ ఈ దాడులకు నేతృత్వం వహించారు.
- దాడుల్లో వందల కిలోల నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
— నగరంలో ప్లాస్టిక్ విక్రయాలపై దాడులు
-వందల కేజీ ల ప్లాస్టిక్ ఉత్పత్తుల స్వాధీనం
—-విక్రేతలకు జరిమానాలు : హెచ్చరికలు
నెల్లూరు నగరంలో శుక్రవారం ప్లాస్టిక్ విక్రయాలపై దాడులు జరిగాయి. నగర పాలక సంస్థ ఎంహెచ్ఓ ఒబిలి దినేష్ ఈ దాడులకు నేతృత్వం వహించారు. దాడుల్లో వందల కిలోల నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ విక్రయదారులకు జరిమానాలు విధించారు. విక్రేతలను గట్టిగా హెచ్చరించారు .
ఇదిలా ఉండగా, ఈ నెల 16వ తేదీన పున్నమి దినపత్రికలో ‘నగరంలో కానరాని ప్లాస్టిక్ నిషేధం’ అన్న ప్రధాన శీర్షికతో, ‘ఫైళ్లలోనే ప్లాస్టిక్ నిషేధం’, ‘ఎక్కడ చూసినా ప్లాస్టిక్ అమ్మకాలే’, ‘నగర చెత్తలో 50 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే’, ‘ప్లాస్టిక్ నిషేధంపై ఎన్నో అనుమానాలు’, ‘విక్రయదారులతో మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు’, ‘విక్రయదారుల నుంచి వేలల్లో మామూళ్లు’, ‘ప్రకటనలకే పరిమితమైన నిషేధం’, ‘పోజులకే నెలవైన దాడులు’ అన్న ఉపశీర్షికలతో వార్త ప్రచురితం కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య శాఖ స్పందించింది.
పున్నమి వార్త నగరంలో సంచలనం సృష్టించడంతో అధికారులు కార్యాచరణతో ముందుకు కదిలారు. ఇప్పటికైనా ప్లాస్టిక్ విక్రయాలపై దాడులు జరిపినందుకు నగర ప్రజలు అభినందించారు. పున్నమి సైతం ‘తన వార్తకు స్పందనకు వందనం’ అంటూ కితాబిచ్చింది.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్