వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు: నెల్లూరు–ముత్తుకూరు ప్రధాన రహదారిపై ధనలక్ష్మీపురం సమీపంలో శుక్రవారం కారు ప్రమాదానికి గురైంది.
- కాకుపల్లి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ కారు అదుపుతప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను ఢీకొట్టింది.
- అనంతరం డివైడర్‌పై కొంతదూరం ప్రయాణించి నిలిచిపోయింది.అదే సమయంలో అటువైపు భారీ వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
నెల్లూరు: నెల్లూరు–ముత్తుకూరు ప్రధాన రహదారిపై ధనలక్ష్మీపురం సమీపంలో శుక్రవారం కారు ప్రమాదానికి గురైంది. కాకుపల్లి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ కారు అదుపుతప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం డివైడర్‌పై కొంతదూరం ప్రయాణించి నిలిచిపోయింది.అదే సమయంలో అటువైపు భారీ వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో కారులో రెవెన్యూ శాఖకు చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. ప్రమాదంతో కొద్దిసేపు స్థానికంగా ఆందోళన నెలకొంది.