వార్త ముఖ్యాంశాలు
- -- వైస్ చైర్మన్గా పొట్టెల్ల ప్రసాద్ --ఏకగ్రీవ ఎంపికలు నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నుంచి జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎంపికైన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
- అలాగే వైస్ చైర్మన్గా పొట్టెల్ల ప్రసాద్ ఎంపికయ్యారు.
- వీరిద్దరి చేత ప్రిసైడింగ్ అధికారైనా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రమాణ స్వీకారం చేయించారు.
— వైస్ చైర్మన్గా పొట్టెల్ల ప్రసాద్
–ఏకగ్రీవ ఎంపికలు
నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నుంచి జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎంపికైన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అలాగే వైస్ చైర్మన్గా పొట్టెల్ల ప్రసాద్ ఎంపికయ్యారు. వీరిద్దరి చేత ప్రిసైడింగ్ అధికారైనా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రమాణ స్వీకారం చేయించారు.
కాగా, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోవూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలోని అందరికీ చిరపరిచితులే. పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి జడ్పీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడంతో జిల్లాలోని ఆయన అభిమానులు, దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గ దేశం శ్రేణులు ఈ ఆనందాన్ని మరింతగా పంచుకున్నారు. కాగా, ఆయన స్వగ్రామం కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెం. ఇది ఇలాఉండగా అయన జడ్పీ చైర్మన్ పీఠాన్ని అధిరోహించడంలో కోవూరు నియోజకవర్గ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కీలక పాత్ర వహించారు .
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్