నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వక్కల వెంకన్న ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం నారక్కపేటలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ప్రజాపాలనకు ఆకర్షితులై అనేకమంది ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసే నాయకులకు తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, గ్రామాభివృద్ధే లక్ష్యంగా రాబోయే రోజుల్లో కలిసికట్టుగా పనిచేస్తామని వెంకన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, నారక్కపేట గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వరంగల్
నారక్కపేటలో బిఆర్‌ఎస్‌కు షాక్: కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు వక్కల వెంకన్న