Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

తప్పిపోయిన వృద్ధుడిని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన గాజువాక పోలీసులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తప్పిపోయిన వృద్ధుడిని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన గాజువాక పోలీసులు

– బ్లూకోట్ కానిస్టేబుల్ కళ్యాణ్ మానవతా సేవలకు అభినందనలు – సోషల్ మీడియా ద్వారా కుటుంబ సభ్యుల ఆచూకీ గుర్తింపు

గాజువాక, నవంబర్ 11 (పున్నమి ప్రతినిధి): తప్పిపోయి, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడిని గుర్తించి, సకాలంలో స్పందించి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించి గాజువాక పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటనలో బ్లూకోట్ కానిస్టేబుల్ కళ్యాణ్ చూపిన చొరవ పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని జింక్ సీఎస్ఎఫ్ మైదానంలో స్థానిక యువకులు క్రికెట్ ఆడుతుండగా, సుమారు 70 నుంచి 80 ఏళ్ల వయస్సు కలిగిన ఓ వృద్ధుడు నడవలేని స్థితిలో నీరసంగా ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఆదేశాల మేరకు బ్లూకోట్ కానిస్టేబుల్ కళ్యాణ్ అక్కడికి చేరుకుని వృద్ధుడికి సహాయం అందించారు. అయితే ఆయన తన వివరాలు చెప్పలేని పరిస్థితిలో ఉండటంతో ఫొటో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేసి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో వృద్ధుడు కోటిపల్లి నూకయ్య, తండ్రి రాముడు అని, బోనోజి తోట, రోడ్ నంబర్ 10లో తన కుమారుడు రమేష్ వద్ద నివసిస్తున్నట్లు గుర్తించారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. వెంటనే కుమారుడు రమేష్‌కు సమాచారం అందించి నూకయ్యను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సమయస్ఫూర్తితో స్పందించి ఓ వృద్ధుడిని తిరిగి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన కానిస్టేబుల్ కళ్యాణ్ సేవలను గాజువాక పోలీసులు అభినందించారు. విధి నిర్వహణతో పాటు మానవతా దృక్పథాన్ని చాటుకున్న ఆయనను స్థానికులు సైతం ప్రశంసిస్తున్నారు.

తప్పిపోయిన వృద్ధుడిని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన గాజువాక పోలీసులు

తప్పిపోయిన వృద్ధుడిని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన గాజువాక పోలీసులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *