Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

అధిక పెన్షన్ ఉక్కు ఉద్యోగులందరికీ ఇవ్వాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అధిక పెన్షన్ ఉక్కు ఉద్యోగులందరికీ ఇవ్వాలి

పున్నమి న్యూస్, అగనంపూడి, నవంబర్ 09.
అగనంపూడి సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాత దానబోయిన పాలెం, సీతా రామాలయంలో ఫించన్ దారుల‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక పించను, జీవన్ ప్రమాణ పత్రo, ఆరోగ్య భీమా, సంక్షేమo తదితర విషయాలు చర్చించారు. అనంతరం, విశాఖ ఉక్కు ప్లాంట్ అభివృద్ధి కోసం, ఉక్కు ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగులు సంక్షేమo, ఆరోగ్య సదుపాయాలు పెంచాలని మరియు అధిక పింఛను అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీ భవన్ లో 100 గంటల ఉక్కు విలీన దీక్ష చేసిన ఉక్కు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కేవిడి ప్రసాద్ కు ఘనంగా సన్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ ఉక్కు ఉద్యోగులు సంక్షేమమే కాదు, ఉక్కు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ చూడడo కూడా మా బాధ్యతనీ, ఉద్యోగులకు అందరికీ అధిక ఫించను, వైద్య భీమా సౌకర్యం ప్రీమియం తగ్గింపు, ఇతర సంక్షేమాలు ఏర్పాటుకు కృషి చేయడమే కాకుండా అధిక పింఛను రాని వారి కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి బోసుబాబు, ప్రధాన కార్యదర్శి బి భాస్కర్ రాజు, ఉపాధ్యక్షుడు గుదే సుశీల గజేంద్రరావు, ప్రతినిధులు ఎస్ ఎమ్ రఫీ, బి కాళిదాసు, ఎస్ రవి కుమార్, ఎస్ కే ఎమ్ ఎల్ ప్రసాద్, బి హెచ్ ఎస్ ఎన్ రాజు, సి నారాయణరావు, ఎమ్ వెంకటేశ్వరరావు, ఐ రామునాయుడు, విందుల వరహాలు తదితర విశ్రాంత ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అధిక పెన్షన్ ఉక్కు ఉద్యోగులందరికీ ఇవ్వాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *