ప్రభుత్వ టీచర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. టీచర్ల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సీఎం ఆదేశాలకు మేరకు త్వరలోనే(పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాక) ప్రక్రియ స్టార్ట్ చేస్తామని, స్కూళ్లు ప్రారంభమయ్యేలోపు ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామన్నారు.
వెబ్ బేస్ కౌన్సిల్ ద్వారా టీచర్ల బదిలీలు ఉంటాయని మంత్రి చెప్పారు. ట్రాన్సఫర్ల కోసం టీచర్లు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, రెకమెండేషన్ల అవసరం లేదని మంత్రి అన్నారు. విద్యార్థులు లేరన్న సాకుతో ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నారనే ఆరోపణలపై మంత్రి స్పందించారు. అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చారు.