Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మళ్లీ కేసీఆర్ వస్తారు: కేటీఆర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మళ్లీ కేసీఆర్ వస్తారు: కేటీఆర్

ఖానాపురం పున్నమి ప్రతినిధి:
రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ఆదిలాబాద్: జిల్లా.. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన ‘రైతు గర్జన’ సభలో ఆయన మాట్లాడుతూ, రైతులు పంటలు వేయాలా వద్దా అనే పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు.
రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్లు తీసుకోవడం, రైతుబంధు పథకం అమలులో జాప్యం చేయడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
“మోసపోతే గోసపడతామని కేసీఆర్ ఆనాడే చెప్పారు. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తారు. రైతులతో పాటు ప్రజలందరినీ ఆదుకుంటారు” అని కేటీఆర్ పేర్కొన్నారు.
రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మళ్లీ కేసీఆర్ వస్తారు: కేటీఆర్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *