ఖానాపురం పున్నమి ప్రతినిధి:
తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు డిస్కంలు షాక్ ఇవ్వనున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ERC) రూ.7,635 కోట్ల నష్టాల వసూలుకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా 100 యూనిట్లలోపు వినియోగదారులకు నవంబర్ నుంచి యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి 50 పైసల చొప్పున అదనపు చార్జీలు విధించనున్నారు.
ఎస్పీడీసీఎల్ పరిధిలో 29 నెలలు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 26 నెలల పాటు ఈ అదనపు చార్జీలను వసూలు చేయనున్నారు. కరెంట్ కనెక్షన్లు, సరఫరా ఖర్చులు పెరగడంతో విద్యుత్ సంస్థలు నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో సామాన్య వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం మరింత పెరగనుంది.
