Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఎన్నికల నియమావళి అమలకు చర్యలు చేపట్టాలి.. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన బిట్రగుంట ఎస్సై రామకృష్ణ

Punnami Newsroom Published:
ఎన్నికల నియమావళి అమలకు చర్యలు చేపట్టాలి.. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన బిట్రగుంట ఎస్సై రామకృష్ణ

Story highlights

  • పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బోగోలు మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను బిట్రగుంట ఎస్సై రామకృష్ణ పరిశీలించారు.
  • ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
  • పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బోగోలు మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను బిట్రగుంట ఎస్సై రామకృష్ణ పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని రాజకీయ నాయకులు, పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లను నిబంధనల ప్రకారం తొలగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *