Saturday, 25 April 2026
  • Home  
  • శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలో చిన్నకోట ఉత్సవాలకు ఘనారంభం
- తిరుపతి

శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలో చిన్నకోట ఉత్సవాలకు ఘనారంభం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 25 (పున్నమి టెంపుల్ న్యూస్( :శ్రీకాళహస్తి ప్రసిద్ధ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో చిన్నకోట ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం వేళ వేదమంత్రాల నడుమ స్వామి శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పాలు, తేనె, పన్నీరు, పుష్పాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు చేసి, స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శనం పొందారు. ఉత్సవ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి అధ్యక్షులు కొట్టేసాయి ప్రసాద్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి బి.కే. వెంకటేశ్వర్లు, వేద పండితులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, ఉత్సవాలు పలు రోజుల పాటు వివిధ ధార్మిక కార్యక్రమాలతో కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు భారీగా పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని దేవస్థానం తరఫున కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.