శ్రీకాళహస్తి, ఏప్రిల్ 16 (పున్నమి టెంపుల్ న్యూస్) శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యం, స్థానిక ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా రూ.500 రాహు-కేతు పూజను రద్దు చేసినట్లు తెలిపారు. అదే సమయంలో స్థానిక పేద ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో శ్రీకాళహస్తి పట్టణం, మండల పరిధిలోని తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ప్రతి బుధవారం కేవలం రూ.100లకే సామూహిక రాహు-కేతు పూజ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే విశిష్ట సేవలలో భాగంగా ఉన్న రూ.5,000 రాహు-కేతు పూజ టికెట్ ధరను రూ.6,000కు సవరించినట్లు పేర్కొన్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ భక్తులకు క్యూ లైన్లలో ఇబ్బందులు లేకుండా దర్శన సమయాన్ని పెంచాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

శ్రీకాళహస్తి భక్తులకు శుభవార్త: రూ. 100 లకే రాహు-కేతు పూజ!