వార్త ముఖ్యాంశాలు
- నిర్మల్: పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ నిర్మల్ పట్టణంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాలను దర్శించుకున్నారు.
- ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తి భావంతో మొక్కులు సమర్పించారు.
- ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకుల హరీష్, కౌన్సిలర్లు నాందేడుపు చిన్ను, ఆకుల రామకృష్ణ, జిల్లా మైనార్టీ చైర్మన్ జునైద్ మెమెన్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొంతం గణేష్, సాయి ప్రతాప్, నరేందర్, ప్రశాంత్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్: పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ నిర్మల్ పట్టణంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తి భావంతో మొక్కులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకుల హరీష్, కౌన్సిలర్లు నాందేడుపు చిన్ను, ఆకుల రామకృష్ణ, జిల్లా మైనార్టీ చైర్మన్ జునైద్ మెమెన్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొంతం గణేష్, సాయి ప్రతాప్, నరేందర్, ప్రశాంత్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.