Wednesday, 27 May 2026
  • Home  
  • రహదారులపై మృత్యుపాశాలుగా మారుతున్న అక్రమ ఫ్లెక్సీలు!
- News

రహదారులపై మృత్యుపాశాలుగా మారుతున్న అక్రమ ఫ్లెక్సీలు!

పొదలకూరు రూరల్ పరిధిలోని ప్రధాన రహదారులపై కొందరు నిర్లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో ఖాళీ స్థలాలు, కూడళ్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈదురుగాలులు, భారీ వర్షాల సమయంలో ఇవి రోడ్లపై పడటంతో పాటు, వీటి ప్లాస్టిక్ పేపర్లు వాహనదారుల చక్రాలకు చుట్టుకుని తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయి. కోల్కతా-చెన్నై, నెల్లూరు-ముంబై జాతీయ రహదారులపై వీటి ఉధృతి ఎక్కువగా ఉంది. స్థానిక పంచాయతీ లేదా అధికారుల ముందస్తు అనుమతితో నిర్దేశిత పరిమాణంలోనే ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, ఎక్కడా ఇవి అమలు కావడం లేదని విమర్శలు వస్తున్నాయి. గడువు ముగిసినా వీటిని తొలగించడం లేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.