Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

రహదారులపై మృత్యుపాశాలుగా మారుతున్న అక్రమ ఫ్లెక్సీలు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రహదారులపై మృత్యుపాశాలుగా మారుతున్న అక్రమ ఫ్లెక్సీలు!

వార్త ముఖ్యాంశాలు

  • పొదలకూరు రూరల్ పరిధిలోని ప్రధాన రహదారులపై కొందరు నిర్లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
  • అధికారులు పట్టించుకోకపోవడంతో ఖాళీ స్థలాలు, కూడళ్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
  • ఈదురుగాలులు, భారీ వర్షాల సమయంలో ఇవి రోడ్లపై పడటంతో పాటు, వీటి ప్లాస్టిక్ పేపర్లు వాహనదారుల చక్రాలకు చుట్టుకుని తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయి.

పొదలకూరు రూరల్ పరిధిలోని ప్రధాన రహదారులపై కొందరు నిర్లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో ఖాళీ స్థలాలు, కూడళ్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈదురుగాలులు, భారీ వర్షాల సమయంలో ఇవి రోడ్లపై పడటంతో పాటు, వీటి ప్లాస్టిక్ పేపర్లు వాహనదారుల చక్రాలకు చుట్టుకుని తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయి. కోల్కతా-చెన్నై, నెల్లూరు-ముంబై జాతీయ రహదారులపై వీటి ఉధృతి ఎక్కువగా ఉంది. స్థానిక పంచాయతీ లేదా అధికారుల ముందస్తు అనుమతితో నిర్దేశిత పరిమాణంలోనే ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, ఎక్కడా ఇవి అమలు కావడం లేదని విమర్శలు వస్తున్నాయి. గడువు ముగిసినా వీటిని తొలగించడం లేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *