అనంతసాగరం అక్టోబర్ 12, పున్నమి ప్రతినిధి :
అనంతసాగరం మండలంలోని మినగల్లు గ్రామంలో సోమవారం విపిఆర్ ఉచిత నేత్ర వైద్య శిబిరం కోఆర్డినేటర్ ఎన్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 290 మంది ప్రజలకు కంటి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. కంటి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం 170 మందికి కళ్ళద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విపిఆర్ ఉచిత నేత్ర సిబ్బంది,టీడీపీ మండల సీనియర్ నాయకులు రాపూరు జనార్దన్ రెడ్డి, కొత్తపల్లి టీడీపీ నాయకులు చల్లా నరసారెడ్డి పాల్గొన్నారు.
