Friday, 2 October 2026
  • Home  
  • మహాత్మా గాంధీ 157 వ జయంతి వేడుకలు జగ్గంపేట
- తూర్పు గోదావరి

మహాత్మా గాంధీ 157 వ జయంతి వేడుకలు జగ్గంపేట

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,అక్టోబర్ 2: స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వాసవి మాత చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వేడుకలకు హాజరైన చిన్నారులు, విద్యార్థినీ విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ కొత్త కొండబాబు మాట్లాడుతూ…*సత్యం, అహింస, ధర్మం అనే ఆయుధాలతోనే దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు మహాత్మా గాంధీ. ఆయన చూపిన బాటలోనే నేటి యువత నడవాలి. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించినప్పుడే నిజమైన నివాళి” అని పేర్కొన్నారు.విద్యార్థులు చిన్ననాటి నుండే క్రమశిక్షణ, నిజాయితీని అలవర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మానేపల్లి బంగార్రాజు, కంచర్ల శ్రీను, బొండా నూకబాబు, కొత్త రాము,బి.వీర సత్య, మాతం శెట్టి నారాయణ, వి నాగసత్య, వి శ్రీరామ్మూర్తి, మాతం శెట్టి లావణ్య, వి రాధాకృష్ణారావు, కంచర్ల బాబు, రమాదేవి ఆర్యవైశ్య సంఘం నాయకులు, వాసవి క్లబ్, వనిత క్లబ్బు సభ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,అక్టోబర్ 2:
స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వాసవి మాత చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వేడుకలకు హాజరైన చిన్నారులు, విద్యార్థినీ విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ కొత్త కొండబాబు మాట్లాడుతూ…*సత్యం, అహింస, ధర్మం అనే ఆయుధాలతోనే దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు మహాత్మా గాంధీ. ఆయన చూపిన బాటలోనే నేటి యువత నడవాలి. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించినప్పుడే నిజమైన నివాళి” అని పేర్కొన్నారు.విద్యార్థులు చిన్ననాటి నుండే క్రమశిక్షణ, నిజాయితీని అలవర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మానేపల్లి బంగార్రాజు, కంచర్ల శ్రీను, బొండా నూకబాబు, కొత్త రాము,బి.వీర సత్య, మాతం శెట్టి నారాయణ, వి నాగసత్య, వి శ్రీరామ్మూర్తి, మాతం శెట్టి లావణ్య, వి రాధాకృష్ణారావు, కంచర్ల బాబు, రమాదేవి ఆర్యవైశ్య సంఘం నాయకులు, వాసవి క్లబ్, వనిత క్లబ్బు సభ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.