వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 13 (పున్నమి ప్రతినిధి) మనుబోలు: మనుబోలు బాలుర హైస్కూల్లో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్, స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు.
- ఈ శిబిరంలో వైద్య నిపుణులు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయనున్నారు.
- ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరం కొనసాగనుంది.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 13 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు: మనుబోలు బాలుర హైస్కూల్లో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్, స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో వైద్య నిపుణులు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరం కొనసాగనుంది. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచిత కంటి వైద్య సేవలను పొందాలని కోరారు.