Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఢిల్లీలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌తో సయ్యద్ హైదర్ భేటీ – జిల్లా పర్యటనకు రావాలని రాజ్యసభ సభ్యుడికి ఆహ్వానం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఢిల్లీలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌తో సయ్యద్ హైదర్ భేటీ – జిల్లా పర్యటనకు రావాలని రాజ్యసభ సభ్యుడికి ఆహ్వానం.

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్‌లో పార్టీ బలోపేతానికి వ్యూహరచన.
  • నిర్మల్ జిల్లా అక్టోబర్ 11 ( పున్నమి ప్రతినిధి) నిర్మల్ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ ఢిల్లీలో ఆప్ పార్టీ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
  • ఈ సమావేశంలో తెలంగాణలో, ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో పార్టీ విస్తరణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయడం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

నిర్మల్‌లో పార్టీ బలోపేతానికి వ్యూహరచన.

నిర్మల్ జిల్లా అక్టోబర్ 11 ( పున్నమి ప్రతినిధి)
నిర్మల్ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ ఢిల్లీలో ఆప్ పార్టీ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో తెలంగాణలో, ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో పార్టీ విస్తరణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయడం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. జిల్లాలో ఆప్ సిద్ధాంతాలను, సంక్షేమ ఎజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు రూపొందించిన కార్యాచరణను ఎంపీకి వివరించారు.
ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాలో పర్యటించి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాల్సిందిగా సంజయ్ సింగ్‌ను సయ్యద్ హైదర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ భేటీతో నిర్మల్ జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ కార్యకలాపాలు మరింత ఊపందుకోనున్నాయని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *