Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Jangaon

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు

Punnami Newsroom Published:

ఘనంగా జనగామ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
————————————————————-
జనగామ, ఆగష్టు 22,పున్నమి జిల్లా ప్రతినిధి :
ఈరోజు స్థానిక మినీ స్టేడియం జనగామలో జనగామ జిల్లా స్థాయి 14, 16, 18 మరియు 20 సంవత్సరాల బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపికలు జరిగినవి, ఈ ఎంపికలలో జిల్లా నలుమూల నుండి దాదాపు 700 మంది క్రీడాకారులు ఈ ఎంపికలలో పాల్గొన్నారు, ఎంపికైన క్రీడాకారులు ఈనెల 26 మరియు 27 తేదీలలో స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హనుమకొండలో జరిగే 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారని జనగామ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పెద్ది వెంకటనారాయణ గౌడ్ గారు తెలియజేశారు, గతంలో సెలక్షన్స్ జరిగినప్పుడు రెండు మూడు వందల మంది క్రీడాకారులు పాల్గొనేవారు అది ఈరోజు దాదాపు 600 నుండి 700 మంది క్రీడాకారులు పాల్గొనడం ఒక గొప్ప విషయమని తెలియజేసి ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు, ఈ ఎంపికల్లో జనగామ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్, కోశాధికారి శ్రీ ఆవుల అశోక్, నిర్వహణ కార్యదర్శి శ్రీ వంచా చంద్రశేఖర్ రెడ్డి, అసోసియేషన్ బాధ్యులు రంజిత్ రవీంద్ర ప్రసాద్ సుధారాణి దిలీప్ కుమార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *