చేగుంట పట్టణ కేంద్రంలో సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు నేడు స్థానిక సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్టేజి వేసి కళాకారులతో ఆటపాలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని అందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.చేగుంట గ్రామాల్లో అన్ని వీధుల నుంచి ఆడపడుచులు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, చేగుంట ఉపసర్పంచ్ రఫీ,వార్డు సభ్యులు,జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జూకంటి రాజా గౌడ్, దుబ్బాక నియోజవర్గ కో ఆర్డినేటర్ సోలిపేట ప్రసాద్ రెడ్డి, ఎఎంసి డైరెక్టర్లు స్టాలిన్ నర్సింలు, అన్నం ఆంజనేయులు, మొజామిల్,ఇబ్రహీంపూర్ ఉపసర్పంచ్ చౌదరి శ్రీనివాస్,మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కోండి శ్రీనివాస్, మహేష్, కాంగ్రెస్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, అయితే పరంజ్యోతి, పుర్ర ఆగం,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్,నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు..

