Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కిటికీలు లేని గదులు.. గేటు లేని పాఠశాల.. ఇదేనా విద్యాశాఖ తీరు?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కిటికీలు లేని గదులు.. గేటు లేని పాఠశాల.. ఇదేనా విద్యాశాఖ తీరు?

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

బసవరాజుపాలెం పాఠశాల పరిస్థితి ఇదేనా..? అధికారులు స్పందించేదెప్పుడు?

ఆత్మకూరు మండలంలోని బసవరాజుపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దుస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు కనీసం గేటు కూడా లేకపోవడంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన నెలకొంది. పాఠశాల ఆవరణలో నిర్వహణ లేకపోవడంతో అడవిని తలపించేలా మారిందని గ్రామస్థులు చెబుతున్నారు. పాఠశాల గదులు బూజుపట్టి, కొన్ని గదులకు కిటికీలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. భవనం పాతబడటంతో పాటు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, అధికారులు వెంటనే పాఠశాలను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు గేటు, కిటికీలు, పారిశుద్ధ్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు ఇకనైనా స్పందించాలని కోరుతున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *