Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

కాంగ్రెస్ పెద్దలను కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన ముస్తాబాద్ మండల అధ్యక్షుడు గజ్జెల రాజు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాంగ్రెస్ పెద్దలను కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన ముస్తాబాద్ మండల అధ్యక్షుడు గజ్జెల రాజు

వార్త ముఖ్యాంశాలు

  • రాజన్న సిరిసిల్ల జిల్లా /పున్నమి ప్రతినిధి 04/07/2026 ఇటీవల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన గజ్జెల రాజు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ను…
  • ఈ సందర్భంగా గజ్జెల రాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తానన్నారు.
  • యువతకు అవకాశాలు కల్పించే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా /పున్నమి ప్రతినిధి
04/07/2026

ఇటీవల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన గజ్జెల రాజు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా గజ్జెల రాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తానన్నారు. యువతకు అవకాశాలు కల్పించే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రాజిరెడ్డి, నామాపూర్ గ్రామ సర్పంచ్ మాదాస్ అనిల్, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తాళ్ల విజయ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరుట్ల మహేష్ రెడ్డి, రంజాని నరేష్, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు మీడిదొడ్డి భాను కుమార్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గోవర్ధన్ నాయక్, వెంకట్రావుపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు రాజిరెడ్డి, సోషల్ మీడియా ఇంచార్జ్ వంశీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *