Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

ఈనెల 21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఈనెల 21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము *తిరుపతి*(విశాఖ పున్నమి ప్రతినిధి):- 20న తిరుచానూరు అమ్మవారి దర్శనం, ఆలయ సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామి దర్శనం రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై టీటీడీ అధికారుల సమీక్ష భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని…
  • ఈ నెల 21న ఆమె స్వామివారి సేవలో పాల్గొంటారు.
  • రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె తిరుపతికి రానున్నారు.

ఈనెల 21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
*తిరుపతి*(విశాఖ పున్నమి ప్రతినిధి):-
20న తిరుచానూరు అమ్మవారి దర్శనం, ఆలయ సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామి దర్శనం

రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై టీటీడీ అధికారుల సమీక్ష

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 21న ఆమె స్వామివారి సేవలో పాల్గొంటారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె తిరుపతికి రానున్నారు. పర్యటనలో భాగంగా ఈ నెల‌ 20న రాష్ట్రపతి ముందుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి తిరుమలకు చేరుకుంటారు. మరుసటి రోజు ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మొదట శ్రీ వరాహస్వామి వారిని, ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ మేరకు గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీవీఎస్వో మురళీకృష్ణతో పాటు ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు. రాష్ట్ర‌ప‌తి పర్యటన సందర్భంగా భద్రత, వసతి, దర్శన ఏర్పాట్లపై వారు చర్చించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు అదనపు ఈవో సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *