వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు: (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి)ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చైర్పర్సన్ అభ్యర్థిత్వంపై రాజకీయ ఆసక్తి నెలకొంది.
- మాజీ ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి కుటుంబానికి చెందిన డాక్టర్ షకీలా, మాగుంట గీతిక తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
- ఒకే కుటుంబానికి చెందిన అత్తా–కోడళ్లు ఇద్దరూ చైర్పర్సన్ అభ్యర్థిత్వానికి నామినేషన్లు వేయనుండటం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాజీ ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి నివాసానికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
టీడీపీ తరఫున అత్తా–కోడళ్ల నామినేషన్లు
తుది అభ్యర్థిపై పార్టీ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూపులు
ఆత్మకూరు: (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి)ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చైర్పర్సన్ అభ్యర్థిత్వంపై రాజకీయ ఆసక్తి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి కుటుంబానికి చెందిన డాక్టర్ షకీలా, మాగుంట గీతిక తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అత్తా–కోడళ్లు ఇద్దరూ చైర్పర్సన్ అభ్యర్థిత్వానికి నామినేషన్లు వేయనుండటం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాజీ ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి నివాసానికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేతలు దృష్టి సారించిన తరుణంలో ఈ భేటీ చోటుచేసుకుంది.డాక్టర్ షకీలా, మాగుంట గీతిక ఇద్దరూ నామినేషన్లు దాఖలు చేయనున్నప్పటికీ, వీరిలో పార్టీ అధికారిక చైర్పర్సన్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తుందన్నది ఇంకా వెల్లడికావాల్సి ఉంది. నామినేషన్ల ప్రక్రియ అనంతరం పార్టీ తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.అత్తా–కోడళ్లలో ఎవరికి తుది అవకాశం దక్కుతుందన్నది పార్టీ నిర్ణయం తర్వాతే స్పష్టత రానుంది. అప్పటివరకు ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో ఈ అంశం రాజకీయ చర్చలో కొనసాగనుంది.