Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

ఫణిగిరి కాలనీలో ఘనంగా వినాయక లడ్డూ వేలం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఫణిగిరి కాలనీలో ఘనంగా వినాయక లడ్డూ వేలం

ఎల్బీనగర్: చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, దీప్తి రెసిడెన్సీ ఎదురుగా బాల్ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. శోభాయాత్ర సందర్భంగా నిర్వహించిన వినాయక లడ్డూ బహిరంగ వేలం భక్తుల ఉత్సాహం మధ్య కోలాహలంగా సాగింది.

వేలం పాటలో ఫణిగిరి కాలనీకి చెందిన భూసన్ వీరబాబు కుటుంబ సభ్యులు భూసన్ శ్రీలత, భూసన్ సృజన, భూసన్ వర్షిత్ కలిసి అత్యధికంగా రూ.14,500కు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా భూసన్ వర్షిత్ మాట్లాడుతూ, తమ కాలనీ పిల్లలంతా కలిసి గత పదేళ్లుగా వినాయక చతుర్థి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. 10వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి లడ్డూను దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

విఘ్నేశ్వరుడి కృపతో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, పిల్లల చదువులు, భవిష్యత్తు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, యూత్ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఫణిగిరి కాలనీలో ఘనంగా వినాయక లడ్డూ వేలం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *