Thursday, 1 October 2026

Tag: హైదరాబాద్ వి విష్ణుమూర్తి

మేడ్చల్ – మల్కాజిగిరి

భూముల సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ

భూముల సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ 15 రోజుల్లోగా నిషేధిత భూములపై దరఖాస్తుల పరిష్కారం సమాచారానికి టోల్‌ఫ్రీ నంబర్ 1800

మేడ్చల్ – మల్కాజిగిరి

హైడ్రాను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలి

హైడ్రాను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలి ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వివిధ వృత్తిదారులు హైడ్రా కమిషనర్‌ను కలిసిన పలువురు వృత్తి నిపుణులు గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసి, వరదలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో హైడ్రాను దిశానిర్దేశం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రంగాలకు చెందిన వృత్తి నిపుణులు మద్దతు తెలిపారు. హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి చెరువులు, వరద కాలువలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నగరంతో పాటు శివారు ప్రాంతాలకు చెందిన పలువురు న్యాయవాదులు, పర్యావరణవేత్తలు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు తదితరులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను కలిసి హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు తెలిపారు. హైడ్రా పునరుద్ధరించిన చెరువులను పరిశీలించిన పలువురు వృత్తి నిపుణులు వాటి అభివృద్ధి తీరుపై హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని చెరువులన్నింటినీ ఇదే తరహాలో ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లతో అభివృద్ధి చేస్తే వరదలను చాలా వరకు నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. చెరువుల పరిసరాల్లో హైడ్రా అభివృద్ధి చేస్తున్న పచ్చదనం భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో చెరువుల్లో మూడు మీటర్ల మేర పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, పూడిక కారణంగా నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. ప్రస్తుతం పూడికను తొలగించి చెరువులను అభివృద్ధి చేయడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకే చెరువుల్లో నీరు చేరి స్వచ్ఛంగా కనిపిస్తున్నాయని వారు తెలిపారు. జలవనరులను పరిరక్షించడం ద్వారా ప్రకృతి సంరక్షణకు ఎంతో మేలు జరుగుతుందని, ఆ దిశగా హైడ్రా చేపడుతున్న చర్యలు అభినందనీయమని అన్నారు. అదేవిధంగా పార్కులు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలు కబ్జాలకు గురికాకుండా చూడటం సాధారణ విషయం కాదని పలువురు పేర్కొన్నారు. హైడ్రా పట్ల నగర ప్రజల్లో నమ్మకం పెరిగిందని, ఇదే స్ఫూర్తితో కార్యక్రమాలను కొనసాగిస్తూ హైదరాబాద్‌లో ఆహ్లాదకరమైన, పర్యావరణహిత వాతావరణాన్ని మరింత మెరుగుపరచాలని కోరారు. చెరువులు, వరద కాలువలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు హైడ్రా చర్యలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ భద్రతా చర్యలు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ భద్రతా చర్యలు ఖాజాగూడ డిపిఎస్  మరియు మల్కంచెరువు ప్రాంతాలలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సన్‌ప్రీత్ సింగ్ ఆకస్మిక తనిఖీ సైబరాబాద్ కమ్యూనిటీకి మెరుగైన, సురక్షితమైన ట్రాఫిక్ వ్యవస్థను అందించడమే లక్ష్యంగా సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సున్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్  సోమవారం ఖాజాగూడ మరియు మల్కంచెరువు ప్రాంతాలలో పర్యటించి, అక్కడి ట్రాఫిక్ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఖాజాగూడలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ( డిపిఎస్ ) వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన ప్రతిపాదిత నూతన యూ-టర్న్ ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు, స్థానిక ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు. కీలక ఆదేశాలు మరియు సూచనలు: కొత్త యూ-టర్న్ ఏర్పాటు: ఖాజాగూడ డి పి ఎస్  వద్ద ప్రస్తుతం ఉన్న పాత యూ-టర్న్‌ను పూర్తిగా మూసివేసి, దానికంటే సుమారు 70 మీటర్ల ముందుగా కొత్త యూ-టర్న్‌ను ఏర్పాటు చేయాలని అడీసీపీ ట్రాఫిక్ (శేరిలింగంపల్లి), ఏసిపి మాదాపూర్ ట్రాఫిక్, మరియు ఎస్ హెచ్ ఓ  రాయదుర్గం ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, వాహనదారులు రాంగ్ రూట్‌లో (తప్పు మార్గంలో) ప్రయాణించడాన్ని పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు. మల్కంచెరువు హైటెన్షన్ రోడ్డు పరిశీలన: అనంతరం మల్కంచెరువు వెనుక వైపు ఉన్న హైటెన్షన్ రోడ్డును సందర్శించి ట్రాఫిక్ రద్దీని సమీక్షించారు. తక్కువ దూరంలోనే రెండు యూ-టర్న్‌లు ఉండటం వల్ల వాహనాల రాకపోకల్లో గందరగోళం ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో, అతి తక్కువ దూరంలో ఉన్న ఆ రెండు యూ-టర్న్‌లను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచడానికి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి మరియు వాహనాల సజావు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో స్థానిక ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రజా సేవే దేశ సేవ.. సమష్టి బాధ్యతతో పనిచేయాలి: కమిషనర్‌ టి. వినయ్‌ కృష్ణారెడ్డి మల్కాజ్‌గిరి, ఆగస్టు 15: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎంసీ కమిషనర్‌  టి. వినయ్‌ కృష్ణారెడ్డి, ఐఏఎస్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించగా అధికారులు, సిబ్బంది దేశభక్తి స్ఫూర్తితో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి తమ జీవితాలను అంకితం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఈ సందర్భంగా అధికారులు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ టి. వినయ్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛా భారతదేశం లభించిందని అన్నారు. స్వాతంత్ర్యం మనకు అందించిన ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, బాధ్యత, సేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తమ విధుల్లో, వ్యక్తిగత జీవితంలో ఆచరణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రజా సేవ కేవలం ఉద్యోగ బాధ్యత మాత్రమే కాదని, దేశం మరియు ప్రజల పట్ల ఉన్న బాధ్యత, నిబద్ధతకు ప్రతీక అని కమిషనర్‌ పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా అందేలా అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం, పచ్చదనాన్ని పెంపొందించడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, మౌలిక వసతులను బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని, మున్సిపల్‌ సేవల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషనర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, సిబ్బంది పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఒకరికొకరు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పలు డివిజన్లలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన జనసేన నాయకులు ముమ్మారెడ్డి ప్రేమకుమార్ కూకట్‌పల్లి, ఆగస్టు 15: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే  ముమ్మారెడ్డి ప్రేమకుమార్ పాల్గొని త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. మోతీనగర్, గాయత్రి నగర్, జనసేన పార్టీ కార్యాలయం (5వ ఫేజ్), బాలాజీనగర్ డివిజన్‌లోని టెంపుల్ బస్‌స్టాప్, బాలానగర్, బోయిన్‌పల్లి, ఫతేనగర్, భారత్‌నగర్, అల్లాపూర్ డివిజన్లలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో ముమ్మారెడ్డి ప్రేమకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని, దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ముమ్మారెడ్డి ప్రేమకుమార్.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు kmచేసుకోవాలని అన్నారు. యువత దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన నాయకులు, వివిధ డివిజన్ల నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో ఆయా ప్రాంతాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి.

మేడ్చల్ – మల్కాజిగిరి

అల్లాపూర్, గాయత్రి నగర్ డివిజన్లలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అల్లాపూర్, గాయత్రి నగర్ డివిజన్లలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అల్లాపూర్ డివిజన్ బీజేపీ నాయకులు సందీప్ నాయక్, గాయత్రి నగర్ డివిజన్ బీజేపీ నాయకులు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు  వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ డివిజన్లలోని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి కార్యకర్తకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

గంజాయి ముఠాతో ఎస్సై, కానిస్టేబుళ్ల దోస్తాన్?

గంజాయి ముఠాతో ఎస్సై, కానిస్టేబుళ్ల దోస్తాన్? ఈగల్ టీం రైడ్‌లో నిందితుల ఎదురుదాడి.. 14.5 కిలోల గంజాయి స్వాధీనం పోలీసులపై కుక్కలను ఉసిగొల్పి, స్క్రూడ్రైవర్‌తో దాడికి యత్నం స్థానిక పోలీసులతో గంజాయి ముఠాకు సంబంధాలున్నట్లు దర్యాప్తులో వెల్లడి 203 మంది కస్టమర్లు.. 100 మందికి పరీక్షలు, 72 మందికి పాజిటివ్‌గా సమాచారం హైదరాబాద్: బాలానగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ముఠాపై ఈగల్ టీం పోలీసులు దాడి చేసిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు దాడి చేయగా నిందితులు కుక్కను ఉసిగొల్పడంతో పాటు స్క్రూడ్రైవర్‌తో పోలీసులపై దాడికి యత్నించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసి సుమారు 14.5 కిలోల గంజాయి, ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బాలానగర్‌లోని వినాయక్‌నగర్ శ్మశానవాటిక సమీపంలో నివసిస్తున్న పాడేరు ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్, కిరణ్, కమలాకర్ అనే ముగ్గురు అన్నదమ్ములు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి వాట్సాప్, డెడ్‌డ్రాప్ విధానంలో కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. పోలీసులపై ఎదురుదాడి పక్కా సమాచారంతో ఈగల్ టీం పోలీసులు ఇంటిపై దాడి చేయగా.. పోలీసులను చూసిన నిందితులు మొదట కుక్కను వారి మీదకు వదిలినట్లు సమాచారం. అనంతరం స్క్రూడ్రైవర్‌తో పోలీసులపై దాడికి ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. మరో నిందితుడు భవనం పైకి వెళ్లి పొరుగింటి భవనంపైకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అతడు అక్కడ సెల్ఫీ వీడియో తీసుకుంటూ కిందికి దూకుతానని బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. చివరకు కిందికి దూకడంతో అతడికి రెండు కాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. పోలీసులతో సన్నిహిత సంబంధాలా? నిందితులను విచారించిన సమయంలో బాలానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కొందరు సిబ్బందితో వారికి సన్నిహిత సంబంధాలున్నట్లు వెలుగులోకి వచ్చినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈగల్ టీం దాడికి కొద్దిసేపటి ముందే ఓ కానిస్టేబుల్ నిందితుల ఇంటికి వచ్చి వెళ్లినట్లు కూడా దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. నిందితుల ఇంట్లో పోలీసులకు సంబంధించిన వైర్‌లెస్ కమ్యూనికేషన్ పరికరం లభించిందన్న సమాచారం కూడా కలకలం రేపుతోంది. పోలీసు సిబ్బందితో నిందితులకు ఏ స్థాయిలో సంబంధాలు ఉన్నాయి? గంజాయి దందా గురించి వారికి ముందే సమాచారం ఉందా? దాడుల సమాచారం నిందితులకు చేరేదా? అనే అంశాలపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 203 మంది కస్టమర్లు నిందితుల ఫోన్లు, ఇతర సమాచారాన్ని పరిశీలించిన పోలీసులు సుమారు 203 మంది కస్టమర్లను గుర్తించినట్లు తెలిపారు. వారిలో 100 మందిని పరీక్షించగా 72 మందికి గంజాయి వినియోగానికి సంబంధించిన పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చినట్లు స్థానిక నివేదికల్లో పేర్కొన్నారు. అయితే మరో నివేదికలో 74 మందికి పాజిటివ్‌గా వచ్చినట్లు పేర్కొనడంతో అధికారిక తుది సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. డెడ్‌డ్రాప్‌ విధానంలో విక్రయాలు ఈ ముఠా నేరుగా కస్టమర్లకు గంజాయి ఇవ్వకుండా ‘డెడ్‌డ్రాప్’ విధానాన్ని అనుసరించినట్లు ఈగల్ అధికారులు వెల్లడించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కస్టమర్‌కు గంజాయి ఉంచిన ప్రదేశం, దాని ఫొటోను పంపించి అక్కడి నుంచి తీసుకెళ్లేలా చేసేవారని సమాచారం. దీంతో నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారినట్లు తెలుస్తోంది. గంజాయి ముఠాపై దాడితో ప్రారంభమైన ఈ కేసు.. ఇప్పుడు స్థానిక పోలీసులతో నిందితులకు ఉన్నట్లు చెబుతున్న సంబంధాల కోణంలోనూ ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసు సిబ్బందిపై వచ్చిన ఆరోపణలు దర్యాప్తులో ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంది. పూర్తి స్థాయి విచారణ అనంతరం అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మేడ్చల్ – మల్కాజిగిరి

హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా రవీందర్ జన్మదిన వేడుకలు

హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా రవీందర్ జన్మదిన వేడుకలు చందానగర్‌లోని హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ సభ్యుడు రవీందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ కేక్ కట్ చేసి స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయకుమార్, విజయభాస్కర్, మల్లేష్, విష్ణుమూర్తి, పీటర్ తదితరులు పాల్గొని రవీందర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రవీందర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రవీందర్‌కు పలువురు స్నేహితులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

కూకట్‌పల్లి ఇన్స్పెక్టర్ స్వామి గౌడ్‌కు శుభాకాంక్షలు

### కూకట్‌పల్లి ఇన్స్పెక్టర్ స్వామి గౌడ్‌కు శుభాకాంక్షలు **కూకట్‌పల్లి:** కూకట్‌పల్లి ఇన్స్పెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన స్వామి గౌడ్‌ను మూసాపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు చున్ను పాషా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ స్వామి గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐ తుకారాంకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్‌ఐ రవీందర్, చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు టీంకు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.