లారీ బీభత్సం: నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ సర్కిల్ వద్ద ప్రమాదం, ఒకరికి తీవ్ర గాయాలు
”నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ సర్కిల్ వద్ద అతివేగంతో వెళ్తున్న లారీ రెండు బైకులను, ఒక కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి.”
”నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ సర్కిల్ వద్ద అతివేగంతో వెళ్తున్న లారీ రెండు బైకులను, ఒక కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి.”
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఆమంచర్ల వద్ద సుమారు 500 ఎకరాల్లో భారీ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి యువరాజ్ IAS శనివారం మధ్యాహ్నం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు తదితర అంశాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం.
నెల్లూరు నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ హిమబిందు శుక్రవారం 10వ డివిజన్ ఎన్‌డీఆర్ లేఅవుట్‌లోని అపార్ట్‌మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానికులతో సమావేశమయ్యారు. డ్రైనేజీ, విద్యుత్, పారిశుధ్య సమస్యలను ప్రజలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను త్వరగా పరిష్కరించి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని హిమబిందు తెలిపారు. అధికారులు సమస్యలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జ్ తిరుమల నాయుడు, శానిటరీ సూపర్‌వైజర్ షరీఫ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నగరాన్ని దోమల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నగరంలో నిలిచిపోయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పనులను తిరిగి ప్రారంభించామని, 2027 జూన్ 12 నాటికి వాటిని పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. 13వ డివిజన్ యలమవారిదిన్నెలో ₹35 లక్షలతో పునర్నిర్మించిన స్వర్ణ వార్డు భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అల్లీపురం డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం, వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నారాయణ వెల్లడించారు.
సర్ పక్రియ లో భాగంగా నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో తిరుపతి జిల్లా డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్ పోలింగ్ స్టేషన్ లను పరిశీలించారు, అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సర్ పక్రియ జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు, ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో ఇప్పటివరకు 32వేల 323 ఓట్ల కు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు, వాటిలో ఇప్పటి వరకు 19 వేల 770 అప్లికేషన్ లను పరిశీలించడం జరిగిందన్నారు, 12 వేల 550 అప్లికేషన్ లు పెండింగ్ లో ఉన్నాయన్నారు,ఓటర్లు మీకు ఇచ్చిన నోటీసుల కు జతగా సరైన డాక్యుమెంట్స్ అదికారుల దగ్గరకు తీసుకోని వెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు, అవకాశం లేని వాళ్లకు పర్చూవల్ గా అయినా హాజరు అయ్యేందుకు అవకాశం కల్పించారాని తెలిపారు, ఈ కార్యక్రమం లో డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు. Uploaded Video: