పెళ్లి సంబంధాలు కుదరట్లేదు అని యువకుడు ఆత్మహత్య
పెళ్లి సంబంధాలు కుదరడం లేదని యువకుడి ఆత్మహత్య కామారెడ్డి,22 సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి. :కామారెడ్డి జిల్లా, కామారెడ్డి మండలం, నర్సన్నపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి సంబంధాలు కుదరడం లేదనే మనస్తాపంతో ధ్యాప మహేష్ అనే 28 ఏళ్ల యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో నర్సన్నపల్లిలో విషాదఛాయలు అలుముకున్నా యి.గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, మహే ష్ గతంలో దుబాయ్‌లో పని చేసి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అతని తండ్రి సాయిలు మహేష్‌కి పెళ్లి చేసి ఇంటికి కోడలిని తీసుకురావాలని ఎన్నో సంబంధాలు చూశాడు, కానీ ఏదీ కుదరలేదు. దీని తో మహేష్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై, గతం లో రెండు సార్లు ఆత్మహత్యకు యత్నించి విఫలమ య్యాడు.ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళిన మహేష్ ఎంతసే పటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన అతని తండ్రి సాయిలు వెతుకుతూ వెళ్ళాడు. రైలు పట్టాల దగ్గర మహేష్ మృతదేహాన్ని చూసి సాయి లు గుండెపగిలేల రోదించాడు.సమాచారం అందు కున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకున్నా రు.సాయిలు ఫిర్యాదు మేరకు రైల్వే అధికారులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీఎచ్ కు తరలించారు. మహేష్ మృతితో అతని కుటుంబంలో విషాదం నిండిపో యింది. తమకు ఉన్న ఒకే ఒక్క కొడుకు దూరం కావడంతో ఆ తల్లిదండ్రుల వేదన గ్రామస్థులను కలచివేసింది. మహేష్ మరణంతో ఆ కుటుంబానికి వారసులు లేకుండా పోయారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.











