Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Regular News

తిరుపతి

పునబాక లో అధ్వానంగా రహదారులు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు!

పెల్లకూరు మండలం పునబాక గ్రామంలో రహదారులు అధ్వానంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై గుంతలు ఏర్పడి, వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా భారీ లోడుతో వెళ్లే వాహనాలు బురదలో చిక్కుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోడ్ల దుస్థితి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారులను పరిశీలించి, మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

తిరుపతి

వెదురుపట్టు రాజుపాలెంలో చెత్త దారుణం.. రోడ్లే డంపింగ్ యార్డులుగా!

​వెదురుపట్టు రాజుపాలెంలో, ఇంటింటికీ తిరిగి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాల్సిన సిబ్బంది, దాన్ని రోడ్డు పక్కన పారబోస్తున్నారు. ఊరి ప్రజలు దీన్ని ప్రశ్నిస్తే, సిబ్బంది డంపింగ్ యార్డ్ దూరం ఉందని, అంత దూరం తీసుకెళ్లడం సాధ్యం కాదని, దీనివల్ల ఏమీ కాదులే అని సాకులు చెబుతున్నారు. ఇలా చెత్తను పారబోయడం వల్ల దోమలు వ్యాప్తి చెంది, అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, చెత్తను తరలించి తమ ఆరోగ్యాన్ని కాపాడాలని ఊరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.