Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Public

మహబూబాబాద్

పసిడి ,వెండి లో స్వల్ప తగ్గుదల

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య బుధవారం (అక్టోబర్ 7) దేశీయ రిటైల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ చమురు ట్యాంకర్లపై దాడులు తీవ్రతరం చేయడంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్ ఆందోళనలో ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో విదేశీ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ధర 0.3 శాతం క్షీణించి ఔన్సుకు 4,150.23 డాలర్ల వద్ద వర్తకమవుతుండగా, పసిడి ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి 4,177.60 డాలర్ల వద్దకు చేరాయి

మహబూబాబాద్

రోజుకొక జామపండు తిందాం – ఆరోగ్యంగా జీవిద్దాం

*నిమ్మకాయ కంటే జామకాయలోనే ‘సి’ విటమిన్ ఎక్కువ!* ​విటమిన్ ‘సి’ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి నిమ్మకాయ లేదా ఉసిరికాయ. అయితే, నిమ్మకాయతో పోలిస్తే జామకాయలోనే విటమిన్ ‘సి’ దాదాపు 3 నుండి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ​100 గ్రాముల నిమ్మరసంలో దాదాపు 50 నుండి 80 మిల్లీగ్రాముల (మి.గ్రా.) విటమిన్ ‘సి’ ఉంటే, అదే 100 గ్రాముల జామకాయలో ఏకంగా 200 నుండి 300 మిల్లీగ్రాముల వరకు విటమిన్ ‘సి’ లభిస్తుంది. సాధారణంగా వయోజనులకు రోజుకు 75 నుండి 90 మి.గ్రా.ల విటమిన్ ‘సి’ అవసరమవుతుంది. అంటే, ఒక చిన్న జామకాయ లేదా 30–40 గ్రాముల జామ ముక్కలు తిన్నా శరీరానికి రోజంతటికీ కావలసిన విటమిన్ ‘సి’ పుష్కలంగా అందుతుంది. ​ *జామకాయలో విటమిన్ ‘సి’ మాత్రమే కాకుండా శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి:* *​పీచు పదార్థం (Fiber):* జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. *​యాంటీఆక్సిడెంట్లు & లైకోపీన్:* రోగనిరోధక శక్తిని పెంచి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ​ *పొటాషియం* : రక్తపోటును (బీపీ) అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. *​తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ (GI):* రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచదు కాబట్టి మధుమేహం (షుగర్) ఉన్నవారికి ఇది ఎంతో మేలైన పండు. ​ _రోజుకొక జామపండు తిందాం – సంపూర్ణ ఆరోగ్యంతో జీవిద్దాం………..

మహబూబాబాద్

శబరిమల మండల – మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో , భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కొట్టాయం జిల్లా యంత్రాంగం సన్నాహక సమీక్షా సమావేశాలను నిర్వహించి ఏర్పాట్లను వేగవంతం చేసింది

కొట్టాయం: రాబోయే శబరిమల మండలం – మకరవిళక్కు యాత్రా కాలానికి గాను కొట్టాయం జిల్లాలో జరుగుతున్న సన్నాహాలను , జిల్లా కలెక్టర్ చేతన్ కుమార్ మీనా అధ్యక్షతన జరిగిన ఒక సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశంలో, జిల్లా వ్యాప్తంగా ఎరుమేలి మరియు వివిధ యాత్రికుల తాత్కాలిక నివాస కేంద్రాల (ఎడతవళాల) వద్ద జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. వివిధ శాఖలు, సంస్థల అధికారులు అమలు చేస్తున్న చర్యలపై కలెక్టర్కు వివరించారు. యాత్ర జరిగే కాలమంతటా యాత్రికుల భద్రత, సులభమైన ట్రాఫిక్ నిర్వహణ, తగినంత పార్కింగ్ సౌకర్యాలు కల్పించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేస్తామని జిల్లా పోలీస్ చీఫ్ కె.ఎం. సాబు మాథ్యూ తెలిపారు. అటవీ మార్గం మూసివేసినట్లయితే కొయిక్కల్ కావులోనే ఉండిపోవాల్సి వచ్చే యాత్రికుల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. అటువంటి యాత్రికులకు తగిన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శబరిమల యాత్రకు అనుసంధానమైన అన్ని రహదారుల మరమ్మతులు, నిర్వహణ పనులను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. యాత్రికులను, వాహనదారులను అప్రమత్తం చేయడానికి ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలలో హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయనున్నారు. *ఆహార భద్రత మరియు ధర ప్రదర్శన* అన్ని ప్రధాన పుణ్యక్షేత్రాల వద్ద ఉన్న విక్రయదారులు ఆహార పదార్థాల ధరల పట్టికలను స్పష్టంగా ప్రదర్శించేలా చూడాలని, తద్వారా యాత్రికులు కొనుగోలు చేసే ముందు ధరలను సరిచూసుకోవడానికి వీలు కలుగుతుందని జిల్లా సరఫరా అధికారికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. భక్తులకు అందించే ఆహారం యొక్క నాణ్యత మరియు భద్రతను పర్యవేక్షించడానికి, ఆహార భద్రతా విభాగం ఎరుమేలి మరియు ఇతర యాత్రా కేంద్రాలలో కఠినమైన తనిఖీలను నిర్వహిస్తుంది. సంబంధిత గ్రామ పంచాయతీలు, ఇతర శాఖలు పాల్గొనే సంయుక్త సమావేశం ద్వారా వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఖరారు చేస్తారు. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తాత్కాలిక కేంద్రాలలో తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు మరియు తగినంత లైటింగ్ లభ్యతను నిర్ధారిస్తుంది. *తాత్కాలిక డిస్పెన్సరీలు మరియు వైద్య సౌకర్యాలు* ఎరుమేలి దేవస్వం బోర్డు మైదానం మరియు కలకెట్టిలో తాత్కాలిక వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి, అదే సమయంలో వివిధ తాత్కాలిక కేంద్రాలలో వైద్య సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. అన్ని ముఖ్యమైన ప్రదేశాలలో తగినంత వైద్య సిబ్బందిని మోహరిస్తారు మరియు భక్తులకు అత్యవసర సహాయం అందించడానికి యాత్రా మార్గాలలో మొబైల్ వైద్య బృందాలు గస్తీ తిరుగుతాయి. *లైఫ్ గార్డ్స్ మరియు అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు* యాత్రికులు ఉపయోగించే స్నాన ఘాట్ల వద్ద లైఫ్ గార్డులను నియమిస్తారు. అత్యవసర పరిస్థితులకు స్పందించే వారి సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి, ఈ సిబ్బందికి అగ్నిమాపక మరియు రెస్క్యూ సేవల విభాగం నుండి శిక్షణ ఇవ్వబడుతుంది. యాత్రా కాలంలో ఎరుమేలిలో ఒక తాత్కాలిక అగ్నిమాపక కేంద్రం మరియు ఒక ప్రత్యేక అగ్నిమాపక, రక్షణ విభాగం కూడా ఏర్పాటు చేయబడతాయి. అటవీ యాత్రా మార్గంలో సురక్షితమైన తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, అలాగే నిర్దేశిత కాలపరిమితిలోగా లైటింగ్ ఏర్పాటును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండల-మకరవిళక్కు యాత్రా కాలమంతటా ఎరుమేలి మరియు కొట్టాయం జిల్లాలోని ఇతర ప్రాంతాల గుండా ప్రయాణించే యాత్రికులకు సురక్షితమైన , క్రమబద్ధమైన మరియు అవసరమైన సౌకర్యాలు అందేలా చూసేందుకు వివిధ శాఖల సమన్వయంతో కూడిన ప్రయత్నాలు చేపడతామని జిల్లా యంత్రాంగం తెలిపింది.

మహబూబాబాద్

కరువు పరిస్థితుల్లో కోట్ల భారం

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రూ-అప్‌ చార్జీలు వేయాలని ఇఆర్స్సీ చెప్పినా కేసీఆర్ గారు అనుమతించలేదు. విద్యుత్ సంస్థల భారాన్ని ప్రజలపై వేయొద్దు అని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి కరువు పరిస్థితుల్లో ప్రజలపై రూ. 5420 కోట్ల భారం వేస్తున్నడు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా పీడన పాలన !! విద్యుత్ సంక్షోభం పై హరీష్ రావు ధ్వజమెత్తారు Uploaded Video:

మహబూబాబాద్

అధిక బిల్లులపై వార్డు మెంబర్ల నిరసన

*మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట బుధవారం వార్డు మెంబర్లు కళ్లకు నల్ల గుడ్డలు కట్టుకుని, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వార్డు మెంబర్ల శిక్షణ తరగతుల నిర్వహణలో వాస్తవంగా జరిగిన ఖర్చులకు మించి బిల్లులు చెల్లించినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన పత్రాలను మీడియా ముందు చూపిస్తూ వారు వివరించారు.* *శిక్షణ తరగతుల్లో స్థానికంగానే వంటలు నిర్వహించి భోజనాలు మాత్రమే అందించారని, సమోసాలు తదితర అల్పాహారాలు తమకు ఇవ్వలేదని తెలిపారు. అశోక హోటల్ నుంచి తీసుకువచ్చిన బిల్స్ పూర్తిగా తప్పు అని మండిపడ్డారు. అలాగే స్కేలు, పెన్సిళ్లు, పెన్నులు వంటి సామగ్రి కూడా ఎవరికీ అందించలేదని చెప్పారు. అయినప్పటికీ ఆయా వస్తువులకు బిల్లులు ఉన్నట్లు ఆర్టీఐ ద్వారా పొందిన పత్రాల్లో వెల్లడైందని పేర్కొన్నారు.* *శిక్షణ తరగతులు జయ్యారం గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించగా, అక్కడ ఇప్పటికే సౌండ్ సిస్టమ్, కుర్చీలు తదితర సౌకర్యాలు ఉన్నప్పటికీ వాటికి కూడా బిల్లులు చూపించినట్లు పత్రాలను ప్రదర్శించారు. ప్రజాధనానికి సంబంధించిన బిల్లుల విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వార్డు మెంబర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, సర్పంచిగా పోటీ చేసిన అభ్యర్థులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.*

మహబూబాబాద్

రాబోయే రోజుల్లో” ఎల్ నీ నో” తీవ్ర ప్రభావం చూపనుంది

భారతదేశంలో “”ఎల్’నినో “” పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఈ సంవత్సరము,, వచ్చే సంవత్సరము” కాలము , కాదని శాస్త్రవేత్తలు ముందే చెప్పినారు పంటలు వర్షాభావం లేక పండవని కరువు పరిస్థితి ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు మనకు తెలియపరిచిన సంగతి మీ అందరికి తెలిసిందే కావున గౌర సభ్యులకు మనం తెలియజేయునది ఏమనగా (ఆల్రెడీ సభ్యులకు కొంత మేరకు తెలుసు కాబట్టి గుర్తు చేయడం కోసమే ఈ మెసేజ్ పెడుతున్నాము.) ఖర్చులు చాలా తగ్గించుకోవాలనే తెలియపరుస్తున్నాము. ఎట్టి పరిస్థితిలోనూ కోటా బియ్యము ( రేషన్ రైస్) ప్రతినెల భద్రపరుచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము చిరుధాన్యాలు నిల్వ చేసుకోండి . అవసరం లేకుండా బట్టలు కొనుక్కోవడం ప్రతి దానికి చిన్న చిన్న ఫంక్షన్లు ఇంట్లో చేయడం ఇంట్లో చిన్న చిన్న దేవతలు పెట్టుకొని ఊరంతా పిలిచి భోజనాలు పెట్టడం,,వెళ్లే ఫంక్షన్లకు ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడం ప్రతి చిన్న విషయానికి కుటుంబ సభ్యులకు ” దావతు ” ఇవ్వడం. పది నుంచి 15 వేల రూపాయల లోపు అత్యవసర పరిస్థితిలో మాత్రమే అప్పు చేయగలరు. ప్లాట్స్ కొనుగోలు చేయడం అలాగే ఖాళీగా ఉన్న స్థలాలకు చుట్టూ ప్రహరీ గోడలు కట్టడం లాంటివి ప్రస్తుతానికి చేయకూడదు. ఇంటికి కొత్త రంగులు వేయడం ప్రస్తుతానికి వాయిదా. టూ వీలర్ ఉంటే చాలా జాగ్రత్తగా వాడుకోండి. పెట్రోల్ రేట్లు కూడా బాగా పెరుగబోతున్నాయి. అలాగే ప్రతి అనవసరమైన విషయానికి బండి వాడవద్దు. నడకను మొదలు పెట్టండి. లేదా సైకిల్ మీద వెళ్లే ప్రయత్నం చేయండి. మన వాడే. కదా అని సూరిటీలు సంతకం పెట్టమాకండి. ఇలా ఎన్నో విషయాలలో ఖర్చులు తగ్గించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. గౌరవ సభ్యులకు ఇట్టి విషయంలో కొంత తెలిసిన గుర్తు చేయటం కోసము తెలియపరుస్తున్నాము ఎండలు విపరీతంగా ఉంటాయి. ఈ సంవత్సరం చలికాలం కూడా అంతగా ఉండదని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలియ పరుస్తున్నారు. అలాగే కరెంటు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. కరెంటు కోతలు ఎక్కువగా ఉండ బోతున్నాయి. ఉంటాయి ఉక్కపోతతో కూడిన ఎండలు ఎక్కువగా ఉంటాయి. వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఆరోగ్యం పై ఎక్కువగా శ్రద్ధ చూపించండి. పరిసర ప్రాంతాల్లో నడకను చేయండి. ఉదయం యోగా, exercise, ప్రాణాయములు తప్పనిసరిగా చెయ్యాలి. 2027 డిసెంబర్ వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు ముందుగానే అందరికి తెలియపరుస్తున్నారు. 2028 పరిస్థితి ఎలా ఉంటుందో సముద్రంలో 2027 ఏప్రిల్ నెలలో మళ్లీ టెస్ట్ చేసి చెప్తారు. ఇది కొద్ది సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతుందా లేదా అనేది వచ్చే సంవత్సరం శాస్త్రవేత్తలు మనకు తెలియపరుస్తారు. కావున గౌర సభ్యులకు తెలియజేయునది ఏమనగా ఖర్చులు తగ్గించుకోండి మినిమం మెయింటినెన్స్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ,,,,, పరిస్థితులు అనుకూలంగా లేవని ఈ కరువు పరిస్థితుల వలన సర్దుబాటు తత్వంతో మసలుకోవాలని తెలియ చేస్తున్నారు. 🙏🏻

మహబూబాబాద్

తెలంగాణలో తీవ్ర విద్యుత్ సంక్షోభం అల్లాడిపోతున్న రైతులు

కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు తెలంగాణలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నీటి వినియోగంలో ప్రభుత్వం అసమర్థత.. అల్లాడిపోతున్న రైతులు గోదావరిలో పుష్కలంగా నీళ్లు పారుతున్నా, ఏపీకి నీళ్లు తరలిపోతున్నా దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని లిఫ్ట్ చేయని ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టులో మొత్తం 10 పంపులకు గాను కేవలం 5 పంపులు నడుస్తుండడం, అవి కూడా కేవలం 8 గంటలు మాత్రమే నడుస్తుండడం గమనార్హం దీంతో 73.56 క్యూమెక్స్ సామర్థ్యం ఉన్నా కేవలం 38.04 క్యూమెక్స్ నీటిని మాత్రమే ఎత్తిపోస్తున్న వైనం జూలై 13వ తేదీన మంత్రుల బృందం దేవాదుల సందర్శించి, అన్ని రిజర్వాయర్లు నింపుతామని ప్రకటించడం ప్రచారం కోసమేనా అంటూ స్థానిక రైతుల ఆగ్రహం కంకి దశలో ఉన్న వరి పంట పూర్తిగా ఎండిపోయే దశకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న దేవాదుల ఆయకట్టు రైతులు మరోవైపు ఇచ్చే 6 నుండి 8 గంటల కరెంటులో కూడా మధ్యలో అనేక సార్లు అంతరాయం రావడంతో మోటర్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయని రైతుల ఆందోళన మొత్తానికి కాంగ్రెస్ పాలన అంటే కరువుకు నిదర్శనమని మరోసారి నిరూపించారని, ఎండిపోతున్న పంటలు చూసి కన్నీళ్లు పెడుతున్న రైతులు

కర్నూలు

పేదల అభివృద్ధి సంక్షేమమే టీడీపీ అజెండా – ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్న శేఖరన్నా

అభివృద్ధి సంక్షేమమే టీడీపీ ప్రధాన అజెండా అని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు భాస్కర్ల చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం సాయంత్రం మండల పరిధిలోని పిల్లిగుండ్ల, ఒంటేడుదిన్నె గ్రామాలలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. గ్రామ టీడీపీ నాయకులు భాస్కర్ల చంద్రశేఖర్కు మేళతాళతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలోని వీదుల్లో పర్యటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమమే కూటమీ ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వం చేపటుతున్న సంక్షేమ పథకాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భరోసా లభిస్తుందన్నారు. అన్నదాత సుఖీభవ, జీరో వడ్డీ రుణాలు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సీడీ, ఏడాదిలో ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం, తల్లికి వందనం ద్వార రూ.13,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పుట్టిన అడబిడ్డకు రూ.40వేలు డిపాజిట్, యువతకు స్వయం ఉపాధి కల్పన తదితర సంక్షేమ పథకాలను గురించి వివరించారు. సంక్షేమం భవిష్యత్కు భరోసా అన్ని ప్రాంతాల అభివృద్ధి అనే లక్ష్యంతో ప్రభత్వం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ మండల కన్వీనర్ తిరుపతయ్యనాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు ఉల్లిగడ్డ రాముడు, పిల్లిగుండ్ల కృష్ణ, ఎమ్మిగనూరు మార్కెట్ చైర్మన్ మల్లయ్య, తెలుగుయువత అధ్యక్షుడు ఐరన్బండ బాషా, ఐటీడీపి రాంపురం రఫిక్, రవి, రమేష్నాయుడు, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.