Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: KotamReddy Sridhar Reddy

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు రూరల్‌లో ₹857 కోట్ల అభివృద్ధి: కోటంరెడ్డి

కూటమి ప్రభుత్వ హయాంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.857 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూరల్ పరిధిలోని 36 డివిజన్లకు రూ.109 కోట్లు మంజూరయ్యాయని, వీటితో 625 అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలో నెల్లూరు నగర కార్పొరేషన్‌కు మరో రూ.300 కోట్ల నిధులు తీసుకురావడానికి మంత్రి నారాయణ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆమంచర్లలో పారిశ్రామికవాడకు 500 ఎకరాలు, నరసింహకొండకు కేంద్ర నిధుల సాధనలో కలెక్టర్ హిమాన్షు శుక్లా సహకారం కీలకమన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి మద్దతివ్వాలని ప్రజలను కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చంద్రబాబు అరెస్టుపై 53 కొవ్వొత్తులతో నిరసన

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2023 సెప్టెంబర్ 9న అరెస్టైన ఘటనను గుర్తుచేసుకుంటూ 53 కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో చంద్రబాబును అరెస్ట్ చేసిందని వారు ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఆయన చేసిన పనని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టును ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఖండించారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోటి రూపాయలతో ఆస్పత్రికి కొత్త హంగులు

నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధికి దాతలు డీఎస్ఆర్ రఘురాం రెడ్డి, ఇస్కాన్ రామకృష్ణారెడ్డి సొంత నిధులు రూ.కోటి అందించారు. ఈ నిధులతో రెండు ఏసీ రెస్ట్‌హౌస్‌లు, ఆర్వో వాటర్ ప్లాంట్, టాయిలెట్ల రెన్యువేషన్ పనులకు పీహెచ్‌డీ స్కాలర్ మల్లెల శ్రీహరి చేత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శంకుస్థాపన చేయించారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.