Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: BreakingNews

ASIFABAD

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే SPM కార్మికుల దీక్ష 147 రోజులకు చేరింది: AITUC

కాగజ్‌నగర్, అక్టోబర్ 13: SPM కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 147వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా AITUC తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించిన AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ, ఇంత సుదీర్ఘకాలంగా కార్మికులు దీక్షలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ, సింగరేణి, దేవాపూర్‌తో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. SPMలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడానికి ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే SPM కార్మికుల సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదని, కార్మిక శాఖ మంత్రి, లేబర్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని, అక్రమంగా ఏర్పాటు చేసిన 10 మెంబర్ కమిటీని రద్దు చేయాలని, కార్మికులను పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకోవాలని 147 రోజులుగా కోరుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని పేర్కొన్నారు. సొసైటీ డబ్బులు, NCLT కోర్టు డబ్బులపై ప్రత్యేక విచారణ జరిపించాలని, వార్షిక బోనస్‌పై లేబర్ అధికారి విచారణ చేపట్టాలని కోరినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం, క్యాంటీన్ ధరలు తగ్గించడం, అగ్రిమెంట్ కాపీ విడుదల చేయడం, కాంట్రాక్టు కార్మికులకు సంబంధించిన G.O. అమలు చేయడం వంటి న్యాయమైన డిమాండ్లను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉన్నతస్థాయి చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించకపోతే AITUC ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి, రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 147వ రోజు దీక్షలో AITUC జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంషద్, జిల్లా కార్యదర్శి షకీర్, JAC కన్వీనర్ గోగర్ల రాజేశ్, కమిటీ సభ్యులు కుశన్న రాజన్న, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.

ASIFABAD

నారాయణపూర్‌లో యువకుడి మృతి.. బావిలో లభ్యమైన మృతదేహం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన: మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన పల్లె రామయ్య కుమారుడు పల్లె సాయికిరణ్ మృతి చెందాడు. గ్రామ సమీపంలోని బావిలో ఆయన మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

జాతీయ అంతర్జాతీయ

గుజరాత్ యూసీసీకి రాష్ట్రపతి ఆమోదం

గుజరాత్ యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు-2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించింది. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, లివ్-ఇన్ సంబంధాలకు సంబంధించిన పౌర చట్టాలను ఏకరీతిగా అమలు చేయడం ఈ చట్టం లక్ష్యం. షెడ్యూల్డ్ తెగలు, రాజ్యాంగంలోని ప్రత్యేక రక్షణ పొందిన వర్గాలకు మినహాయింపులు ఉన్నాయి. అమలు తేదీని గుజరాత్ ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.