Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి – కలెక్టర్ నిశాంతి

పాడేరు: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ టి. నిశాంతి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగంలోని న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మౌలిక సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అధికారులు పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేస్తూ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించాలన్నారు. అల్లూరి జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గిరిజనుల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

అల్లూరి సీతారామరాజు

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

పాడేరు, నవంబర్ 26: అల్లూరి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి టి. నిశాంతి అధికారులతో సమీక్షించారు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 29న పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగుల మండలాల్లో జరగనున్న రెండో విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. 87 గ్రామ పంచాయతీలు, 880 వార్డులకు ఎన్నికల నిర్వహణలో సిబ్బందికి శిక్షణ, రవాణా, భోజన వసతి, ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్ ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అల్లూరి సీతారామరాజు

తొలి విడతలో 59.61 శాతం పోలింగ్; కోయ్యూరు ముందంజ

అల్లూరి జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతలో భాగంగా చింతపల్లి, కోయ్యూరు, గూడెం కొత్తవీధి మండలాల్లో పోలింగ్ ముగిసింది. మొత్తం 1,60,317 మంది ఓటర్లకు గాను 94,349 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 59.61 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 46,980 మంది, మహిళలు 47,369 మంది ఓటు వేశారు. కోయ్యూరులో అత్యధికంగా 67.35 శాతం, చింతపల్లిలో 56.05, గూడెం కొత్తవీధిలో 55.45 శాతం నమోదైంది.

అల్లూరి సీతారామరాజు

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

పాడేరు, నవంబర్ 26: అల్లూరి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి టి. నిశాంతి అధికారులతో సమీక్షించారు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 29న పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగుల మండలాల్లో జరగనున్న రెండో విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. 87 గ్రామ పంచాయతీలు, 880 వార్డులకు ఎన్నికల నిర్వహణలో సిబ్బందికి శిక్షణ, రవాణా, భోజన వసతి, ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్ ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అల్లూరి సీతారామరాజు

యువత ప్రతిభకు యువజన ఉత్సవాలు చక్కని వేదిక

పాడేరు, నవంబర్ 26: అల్లూరి జిల్లా యువజన సర్వీసుల శాఖ, సెట్విస్ ఆధ్వర్యంలో పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ టి. నిశాంతి పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి ఉత్సవాలు చక్కని వేదికలని తెలిపారు. జానపద గేయాలు, నృత్యాలు, వీధి నాటకం, పెయింటింగ్, కవిత్వం విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ సీఈఓ ఎం. రమ్య, కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకులోయ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

అరకులోయ: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం అరకులోయ మండల పరిషత్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో వీసం ప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు అధికారులు, సిబ్బంది రాజ్యాంగ ప్రవేశికను సామూహికంగా చదివి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆశయాలు, విలువలు, సూత్రాలను గౌరవిస్తూ విధి నిర్వహణలో, నిత్యజీవితంలో ఆచరించాలని ఎంపీడీవో సూచించారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ మౌలిక విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ప్రజలు, విద్యార్థులు, యువతకు రాజ్యాంగ హక్కులు, విధులపై అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో కేవీఏ సత్యనారాయణ, పంచాయతీ అభివృద్ధి అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలి

అరకులోయ: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, ప్రాథమిక హక్కులను కల్పించిందన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ప్రాథమిక విధులను బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు డిగ్రీ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

అరకు వ్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మైభారత్ విశాఖపట్నం, రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్ కేశవరావు అధ్యక్షతన దీపప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమని ప్రిన్సిపల్ వివరించారు. ముఖ్య అతిథి యూత్ ఐకాన్ శివమణికంఠ రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు. డాక్టర్ సంధ్యారాణి, ఎన్‌ఎస్‌ఎస్ పీఓలు సుధీర్, విజయలక్ష్మి విద్యార్థులకు హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. వ్యాసరచన, చిత్రలేఖన పోటీల విజేతలకు బహుమతులు, మైభారత్ సర్టిఫికెట్లు అందజేశారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

మహిళా సాధికారతకు ‘నయీ చేతనా 5.0’ ప్రచార కార్యక్రమం

పాడేరు, నవంబర్ 25: అల్లూరి సీతారామరాజు జిల్లాలో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు ‘నయీ చేతనా 5.0’ జాతీయ మహిళా సాధికారత ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. SERP ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో మహిళల ఆర్థిక స్వావలంబన, ఆస్తి హక్కులు, సురక్షిత ప్రయాణం, సమాన అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. SERP సీఈఓ, ప్రభుత్వ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి కరుణ వాకాటి ఐఏఎస్ ఆదేశాల మేరకు విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అల్లూరి సీతారామరాజు

సైనిక్ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పాడేరు, నవంబర్ 25: దేశవ్యాప్తంగా సైనిక్, నూతన సైనిక్ పాఠశాలల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 6, 9వ తరగతుల ప్రవేశాల కోసం AISSEE–2027 ఆన్‌లైన్ దరఖాస్తులను ఎన్‌టీఏ ఆహ్వానించింది. డిసెంబర్ 2వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 6 వరకు అవకాశం కల్పించారు. ప్రవేశ పరీక్ష జనవరి 31, 2027న ఓఎంఆర్ విధానంలో నిర్వహించనున్నారు. 6వ తరగతికి 150 నిమిషాలు, 9వ తరగతికి 180 నిమిషాల పరీక్ష ఉంటుంది. వివరాలకు అధికారిక వెబ్‌సైట్⁠ సందర్శించాలని అధికారులు సూచించారు.