संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

అరకు: కౌంటింగ్‌ కేంద్రం, స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలన

అరకులోయ, అక్టోబర్‌ 3: అరకులోయ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్‌ హాల్‌, స్ట్రాంగ్‌ రూమ్‌లను ఎంపీడీవో వీసం ప్రసాద్‌ శనివారం పరిశీలించారు. డిప్యూటీ ఎంపీడీవో కె.వి. సత్యనారాయణ, మండల ఇంజనీరింగ్‌ ఇన్‌చార్జి పైడితల్లి, ఏఓ పి. వీరభద్రరావు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. విద్యుత్‌, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత తదితర మౌలిక వసతులను సిద్ధం చేస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అల్లూరి సీతారామరాజు

చింతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆత్మరక్షణ శిక్షణ

చింతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ నిశాంతి ఆదేశాల మేరకు బండి మార్షల్ ఆర్ట్స్ జిల్లా ఇన్‌చార్జ్ బాకూరు పాండురాజు ఆధ్వర్యంలో మూడు నెలలపాటు శిక్షణ కొనసాగనుంది. మండలంలోని 12 పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. విద్యార్థినులు ప్రతిరోజూ శారీరక దారుఢ్యానికి సమయం కేటాయించాలని సూచించారు. ఆత్మరక్షణతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, శిక్షకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

20 ఏళ్లుగా రోడ్డు లేని పామురాయికి పీఎం-జన్మన్‌ రోడ్డు

హుకుంపేట, అక్టోబర్ 3: హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పరిధిలోని పామురాయి గ్రామానికి 20 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారానికి పీఎం-జన్మన్‌ పథకం ద్వారా రూ.1.26 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఏపీ ఆర్టీసీ రీజినల్‌ చైర్మన్, టీడీపీ ఇన్‌చార్జి డా. ఎస్. దొన్నుదొర కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్‌చార్జి శతక బొంజుబాబు, బాకూరు వెంకటరమణ, సూర్యకాంతమ్మ, బి. మోహన్, పి. చిరంజీవి, కే. కామరాజు, పి. కామేశ్వరరావు, టి. సంతోష్, జనసేన నాయకుడు పి. సతీష్ తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అల్లూరి జిల్లాలో అక్టోబర్ 5న 30 తారు రోడ్లు ప్రారంభం

పాడేరు, అక్టోబర్ 3: అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.70.68 కోట్లతో నిర్మించిన 75.64 కి.మీ. పొడవైన 30 తారు రోడ్లను అక్టోబర్ 5న ప్రారంభించనున్నారు. ఈ మేరకు శనివారం జిల్లా అధికారులు తెలిపారు. PM-JANMAN నిధులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించనుండగా, కలెక్టర్, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. అనంతగిరి, డుంబ్రిగూడ, హుకుంపేట, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో రహదారులు నిర్మించారు. వీటితో మారుమూల గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడనున్నాయి.

అల్లూరి సీతారామరాజు

అనంతగిరి: సరియాపల్లి ఆనకట్టు పరిశీలన

అనంతగిరి మండలం సరియాపల్లి గ్రామంలోని ఆనకట్టు నీటి నిల్వను ఎస్‌ఎంఐ ఈఈ ముక్కల రాజేంద్రకుమార్ శనివారం పరిశీలించారు. 2014 హుదూద్ తుపానులో దెబ్బతిన్న ఆనకట్టు పునర్నిర్మాణానికి సుమారు రూ.75 లక్షలు అవసరమని తెలిపారు. ఆనకట్టు ద్వారా సుమారు 250 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రస్తుతం రైతులు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారని తెలిపారు. నీటి విడుదల వ్యవస్థను పరిశీలించి, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. డీఈఈ కే.శ్రీదేవి, ఏఈఈ త్రినాధ్, నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు రమణ, రైతులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని సీపీఎం దీక్ష

గాంధీ జయంతి సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో అరకులోయలో గురువారం ఒకరోజు దీక్ష నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కిల్లో సురేంద్ర దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని, ఓటు హక్కును పరిరక్షించాలని కోరారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో నిబంధనలను మార్చడం వల్ల యువ ఓటర్లు తమ హక్కును కోల్పోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీపీఎం అరకులోయ మండల కార్యదర్శి కె. రామారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని సీపీఎం దీక్ష

గాంధీ జయంతి సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో అరకులోయలో గురువారం ఒకరోజు దీక్ష నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కిల్లో సురేంద్ర దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని, ఓటు హక్కును పరిరక్షించాలని కోరారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో నిబంధనలను మార్చడం వల్ల యువ ఓటర్లు తమ హక్కును కోల్పోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీపీఎం అరకులోయ మండల కార్యదర్శి కె. రామారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

టీడీపీ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి : అరకు ఎమ్మెల్యే రేగం

అరకులోయ నియోజకవర్గంలోని పెదలబుడు, పద్మాపురం, అనంతగిరి మండలం వాలసి పంచాయతీలకు చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరారన్న ప్రచారంలో వాస్తవం లేదని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. టీడీపీ లో పలువురు వైసీపీ నాయకులు చేరినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. చేరినట్లు ప్రచారం జరుగుతున్న వారికి వైసీపీతో సంబంధం లేదని, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులుగా ఉన్నారని పేర్కొన్నారు. వైసీపీకి ప్రజాదరణ కొనసాగుతోందని, తప్పుడు ప్రచారాలతో దానిని తగ్గించలేరన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ స్థానాల్లో 90 శాతం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాలను మానుకోవాలని కోరారు.

అల్లూరి సీతారామరాజు

అరకు పైన్‌రీకి “స్వచ్ఛ పర్యాటక ప్రదేశం” అవార్డు

అల్లూరి జిల్లా అరకు పైన్‌రీకి “స్వచ్ఛ పర్యాటక ప్రదేశం” అవార్డు లభించింది. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా డీఎఫ్‌ఓ కె.ఉమా మహేశ్వరి, జిల్లా పర్యాటక అధికారి పట్టాసీ చలపతిరావు అవార్డు అందుకున్నారు. ఎఫ్‌ఆర్‌ఓ బి.కోటేశ్వరరావు, మేనేజర్ ఎం.శేఖర్ పాల్గొన్నారు. పరిశుభ్రత, పర్యాటక సౌకర్యాలకు గుర్తింపుగా అవార్డు దక్కింది. పైన్‌రీలో ప్లాస్టిక్‌ ఫ్రీ జోన్‌ అమలుతో పాటు డిపాజిట్‌పై గ్లాస్‌ వాటర్‌ బాటిళ్లను అందిస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు

అనంతగిరి: తోటవలసలో తాగునీటి ట్యాంక్ నిర్మించాలని వినతి

అనంతగిరి: కొత్తూరు పంచాయతీలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో తెదేపా గ్రామ కమిటీ అధ్యక్షుడు దుంబరి కృష్ణ పలు సమస్యలపై ఎంపీడీవో ప్రభాకరావుకు వినతిపత్రం అందించారు. తోటవలసలో తాగునీటి ట్యాంక్ నిర్మించాలని, టెంకబుడ్డి, బుసుపాడు గ్రామాలకు రోడ్డు, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. అర్హులకు ఆర్‌ఎఫ్‌ఓ పట్టాలు, నూతన రేషన్‌కార్డుదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.