संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

అక్వాన్ తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
అక్వాన్ తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి

खबर की मुख्य बातें

  • అక్వాన్ తుఫాను ప్రభావంతో ఈ నెల 20, 21 తేదీల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.
  • కోత కోసిన వరి పనలను ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలించి టార్పాలిన్లతో కప్పాలని, నూర్పిడి చేసిన ధాన్యాన్ని తేమ తగలకుండా భద్రపరచాలని కోరారు.
  • పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగు కాలువలను శుభ్రం చేసుకోవాలని తెలిపారు.

అక్వాన్ తుఫాను ప్రభావంతో ఈ నెల 20, 21 తేదీల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. కోత కోసిన వరి పనలను ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలించి టార్పాలిన్లతో కప్పాలని, నూర్పిడి చేసిన ధాన్యాన్ని తేమ తగలకుండా భద్రపరచాలని కోరారు. పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగు కాలువలను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. పంట నష్టం జరిగితే వెంటనే వ్యవసాయ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. ఈ మేరకు పాడేరు వ్యవసాయ సహాయ సంచాలకులు బి. ప్రభాకర్, వ్యవసాయ అధికారి ఇ. శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారులు పార్వతి, నాయుడు వణుగుపల్లి, కందమామిడి గ్రామాల్లో పర్యటించి రైతులకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

समाचार स्रोत

  • Punnami Reportingआधिकारिक बयान

Leave a comment

Your email address will not be published. Required fields are marked *