संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

అరకు: చొంపి జంక్షన్ హైవే కింద వాగులో యువతి మృతదేహం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
అరకు: చొంపి జంక్షన్ హైవే కింద వాగులో యువతి మృతదేహం

खबर की मुख्य बातें

  • అరకులోయ సమీపంలోని చొంపి జంక్షన్ హైవే బ్రిడ్జి కింద వాగులో బుధవారం ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
  • పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
  • మృతురాలు డుంబ్రిగుడ మండలం గుంటగన్నెల పంచాయతీ జాకరవలసకు చెందిన కిల్లో మీనాక్షిగా గుర్తించారు.

అరకులోయ సమీపంలోని చొంపి జంక్షన్ హైవే బ్రిడ్జి కింద వాగులో బుధవారం ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు డుంబ్రిగుడ మండలం గుంటగన్నెల పంచాయతీ జాకరవలసకు చెందిన కిల్లో మీనాక్షిగా గుర్తించారు. మీనాక్షి అరకు ఆర్ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతోంది. మృతదేహం వద్దకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై బంధువులు, గ్రామస్తులు, విద్యార్థి, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కారకులను కఠినంగా శిక్షించాలని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అరకులోయ ఏరియా ఆసుపత్రి నుండి పోలీసు స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *