संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

నీతిఆయోగ్ జాతీయ వర్క్‌షాప్‌లో అల్లూరి ‘ASR SAATHI’కి ప్రథమ స్థానం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నీతిఆయోగ్ జాతీయ వర్క్‌షాప్‌లో అల్లూరి ‘ASR SAATHI’కి ప్రథమ స్థానం

న్యూఢిల్లీలో నిర్వహించిన నీతిఆయోగ్ జాతీయ వర్క్‌షాప్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి. నిశాంతి ‘ASR SAATHI’ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రజెంట్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 200 ప్రతిపాదనలు అందగా, ఎంపికైన 25 కార్యక్రమాల్లో అల్లూరి జిల్లా కార్యక్రమం ప్రథమ స్థానాన్ని సాధించింది. గిరిజన ప్రాంతాల్లో మాతృ మరణాల నివారణకు సాంకేతికతను అనుసంధానిస్తూ అమలు చేస్తున్న జీరో మేటర్నల్ మార్టాలిటీ కార్యక్రమం, హెల్త్ పోర్టల్, డ్రోన్ ద్వారా అత్యవసర మందుల సరఫరా, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలను కలెక్టర్ వివరించారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రత్యేకంగా అభినందించారు. దేశవ్యాప్తంగా ఇతర గిరిజన జిల్లాల్లోనూ అమలు చేసేందుకు సమగ్ర కార్యాచరణ విధానం (SOP) రూపొందించాలని సూచించారు. దీంతో అల్లూరి జిల్లా జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది.

నీతిఆయోగ్ జాతీయ వర్క్‌షాప్‌లో అల్లూరి ‘ASR SAATHI’కి ప్రథమ స్థానం

समाचार स्रोत

  • Punnami Reportingआधिकारिक बयान

Leave a comment

Your email address will not be published. Required fields are marked *