संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

ముక్కా శ్రావణి తండ్రి మృతి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ముక్కా శ్రావణి తండ్రి మృతి

खबर की मुख्य बातें

  • ముక్కా శ్రావణి తండ్రి మృతి విశాఖపట్నం: జీవీఎంసీ మేయర్‌ ముక్కా శ్రావణి తండ్రి ముత్యాల నాయుడు శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు.
  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
  • అయితే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

ముక్కా శ్రావణి తండ్రి మృతి

విశాఖపట్నం: జీవీఎంసీ మేయర్‌ ముక్కా శ్రావణి తండ్రి ముత్యాల నాయుడు శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
ముత్యాల నాయుడు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
మరో మూడు రోజుల్లో ముక్కా శ్రావణి జీవీఎంసీ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ తండ్రి మృతి చెందడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మేయర్‌గా ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం పలువురిని కలచివేసింది.
ముత్యాల నాయుడు గతంలో రాజకీయాల్లో చురుకుగా పనిచేశారు. 2007లో కార్పొరేటర్‌గా పనిచేసిన ఆయన టీడీపీకి విశేష సేవలు అందించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ అభివృద్ధికి తనవంతు సహకారం అందించారు.
ముత్యాల నాయుడు మృతి పట్ల స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *